జైలర్ - 2లో టాలీవుడ్ స్టారో హీరో? ట్వీట్‌తో లీక్ చేసిన నెల్సన్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ 70 ఏళ్ల వయసులోనూ దూకుడు మీదున్నారు. కుర్ర హీరోలను మించి వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది వేట్టయాన్ సినిమాతో అభిమానులను అలరించిన తలైవా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే జైలర్ 2. ఈ సినిమా ఇటీవలే అఫీషియల్‌గా సెట్స్‌పైకి వెళ్లింది.
రజనీకాంత్ వీరాభిమాని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. రజనీ వయసుకు తగినట్లుగా పాత్రను డిజైన్ చేసి ఎక్కడా అసంతృప్తి కలగకుండా కథను నడిపించారు నెల్సన్. ఇది అందిరికీ నచ్చడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ , సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్ణా మీనన్ , వినాయకన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

పోలీస్ ఆఫీసర్ అయిన కొడుకుని చంపిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథే జైలర్. ఈ సినిమాను రజనీ మార్క్ వన్ మేన్ షోగా చెప్పవచ్చు. తాతయ్యగా , తండ్రిగా, నిజాయితీ గల పోలీస్ అధికారికగా సూపర్ స్టార్ అత్యంత సహజంగా నటించాడు. అనిరుధ్ సంగీతం, తమన్నా స్పెషల్ సాంగ్, యాక్షన్ సీన్స్ అన్ని మాస్‌ను ఒక ఊపేశాయి. అలాంటి జైలర్‌కు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఈ సంక్రాంతికి జైలర్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ తీసుకొచ్చారు రజనీ.
జైలర్ 2 కథ, కథనం విషయంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు నెల్సన్. ఫస్ట్ పార్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. పార్ట్ 1లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మెరిశారు. తాజాగా పార్ట్ 2లోనూ ఇదే కంటిన్యూ చేయాలని నెల్సన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా టాలీవుడ్‌లోని కొందరు స్టార్ హీరోలను ఆయన సంప్రదించినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే బాలయ్యను నెల్సన్ సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జైలర్ 1 లోనే బాలయ్యను నటింపజేయాలని నెల్సన్ తీవ్రంగా ప్రయత్నించి చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. అయితే పార్ట్ 2 విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు నెల్సన్. బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
దీనిని నిజం చేస్తూ డాకు మహారాజ్ సినిమా తమిళంలో ప్రదర్శితమవుతుండటంతో బాలయ్య సహా దర్శకుడు బాబీ, థమన్, నాగవంశీలకు నెల్సన్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దీనిని బాలయ్య అభిమానులు ట్రెండ్ చేస్తూ జైలర్‌లో బాలకృష్ణ ఫిక్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. బాలయ్య నిజంగానే జైలర్ 2లో నటిస్తున్నారా? లేక ఇవన్నీ గాలివార్తలేనా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











