టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్: యంగ్ డైరెక్టర్‌తో బాలయ్య క్రేజీ సినిమా
ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోన్నారు.
దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య మరో క్రేజీ ప్రాజెక్టును చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఆ పూర్తి వివరాలేంటో మీరే లుక్కేయండి మరి!

హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ ఫామ్: వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి క్రేజీ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ఇది కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా బాలయ్య వరుసగా మూడు హిట్లను అందుకుని హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్నారు.

బాబీతో భారీ ప్రాజెక్టు చేస్తూ: నటసింహా నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. అంతేకాదు, చాలా వరకూ టాకీ పార్టును సైతం కంప్లీట్ చేసుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చే ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇది ఈ ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది.

మళ్లీ హిట్ కాంబినేషన్‌లో: టాలీవుడ్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ తన 110వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. దీన్ని 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లోపు బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేస్తారని అంటున్నారు. అలాగే, బోయపాటి కూడా ఓ మూవీ చేస్తారని సమాచారం.
ఆ డైరెక్టర్లతోనూ చర్చలు: నందమూరి బాలకృష్ణ.. బాబీ, బోయపాటి శ్రీనుతోనే కాకుండా మరికొందరు డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయన తనకు 'వీర సింహా రెడ్డి' వంటి హిట్‌ను అందించిన గోపీచంద్ మలినేనితోనూ ఓ సినిమా చేయబోతున్నారట. అలాగే, ప్రశాంత్ వర్మ, హరీశ్ శంకర్ సహా కొందరితో ఆయన మూవీలు చేయనున్నారు.

యంగ్ డైరెక్టర్‌తో సినిమా: ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న నందమూరి బాలకృష్ణ.. మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్‌ను ఇచ్చేశారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ సమాచారం ప్రకారం.. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. 'ట్యాక్సీవాలా'తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్'తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ గాయ్ రాహుల్ సంకృత్యాన్ అని తాజాగా తెలిసింది.
111వ సినిమానే అంటూ: నటసింహా నందమూరి బాలకృష్ణ.. బాబీతో మూవీ తర్వాత బోయపాటి శ్రీనుతో ప్రాజెక్టు చేయనున్నారని టాక్ నడుస్తోంది. దీని తర్వాత చేసే సినిమా రాహుల్ సంకృత్యాన్‌తోనే అని తాజాగా తెలిసింది. ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్య కోసం ఓ విభిన్నమైన స్టోరీని రాసుకున్నాడని అంటున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











