క్లాస్ డైరెక్టర్‌తో బాలకృష్ణ మాస్ మూవీ.. గాడ్ ఆఫ్ మాసెస్‌తో క్రేజీ కాంబినేషన్?

నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో కుర్రాళ్లను మించి దూసుకెళ్తున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు యంగ్ డైరెక్టర్స్‌తో పాటు సీనియర్లు క్యూకడుతున్నారు. బాలయ్యతో కొత్త కాంబో అంటూ రోజుకొక డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. తాజాగా బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఓ క్లాస్ డైరెక్టర్ ముందుకొచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాస్‌ జనాలకు దేవుడి లాంటి బాలయ్యతో క్లాస్‌కే గురువు లాంటి దర్శకుడు సినిమా చేయబోతున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'స్మశానంలో 6 అడుగులే నాకున్న ఆస్తి... జీవితంలో చివరి కోరిక అదే’
'స్మశానంలో 6 అడుగులే నాకున్న ఆస్తి... జీవితంలో చివరి కోరిక అదే’

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్వకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలయ్య ఓ పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా కనిపించబోతున్నారట. బాలయ్య మార్క్ డైలాగులు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమాను తెరకెక్కుతోంది. నయనతార, కాజల్ అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటించనున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మలినేని సినిమాతో సెట్స్ మీద ఉండగానే దీనికి సమాంతరంగా మరో సినిమా చేయాలని నట సింహం సిద్ధమయ్యారు.

Nandamuri Balakrishna to Team Up with Sekhar Kammula Buzz Around a Unique Mass-Class Combo

వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల చెప్పిన కథ నచ్చడంతో బాలకృష్ణ వారికి అవకాశం ఇచ్చినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే అనివార్య కారణాలతో వివేక్ ఆత్రేయతో మూవీని బాలయ్య పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మరో యువ దర్శకుడు విజయ్ కనకమేడల మూవీకి బాలకృష్ణ ఓకే చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. సుధాకర్ చెరుకూరి ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తారని, దర్శకుడికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ అనూహ్యంగా కొరటాల శివ ఎంట్రీ ఇచ్చారు. కొరటాల కథ నచ్చడం దానికి బాలయ్య ఓకే చెప్పడమే కాదు.. ఏకంగా మే 1న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఫిలింనగర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

Recommended For You
హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా? దిమ్మతిరిగేలా స్టార్ యాంకర్ కౌంటర్
హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా? దిమ్మతిరిగేలా స్టార్ యాంకర్ కౌంటర్

కాగా.. క్లాస్, ఫీల్ గుడ్ సినిమాలకు శేఖర్ కమ్ముల కేరాఫ్ అడ్రస్. రొమాంటిక్, లవ్ స్టోరీలకు ఆయన పెట్టింది పేరు. ఎలాంటి హడావుడి లేకుండా క్లాస్‌గా కథను చెప్పడంలో శేఖర్ కమ్ముల తనదైన ముద్రవేశారు. 25 ఏళ్లకు పైగా కెరీర్‌లో తీసింది తక్కువ చిత్రాలే అయినా టాలీవుడ్‌లో అందరికీ ఇష్టమైన దర్శకుడు అనిపించుకున్నారు. అలాంటి శేఖర్ కమ్ములతో హై ఓల్టేజ్, భారీ డైలాగులు, యాక్షన్‌కు కేరాఫ్ లాంటి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నట్లుగా ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

You May Also Like
20 Years Of Pokiri: పోకిరి ప్రభంజనానికి 20 ఏళ్లు... రికార్డ్ కలెక్షన్స్‌తో మహేశ్‌బాబు సరికొత్త చరిత్ర!
20 Years Of Pokiri: పోకిరి ప్రభంజనానికి 20 ఏళ్లు... రికార్డ్ కలెక్షన్స్‌తో మహేశ్‌బాబు సరికొత్త చరిత్ర!

క్లాస్ సినిమాలు తీసినా.. లీడర్ లాంటి పొలిటికల్ థ్రిల్లర్‌ను తీసిన అనుభవం శేఖర్ కమ్ములది. క్లాస్ టచ్‌కి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు శేఖర్. ఇప్పుడు బాలయ్య ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా ఓ పొలిటికల్ మాస్ మసాలా మూవీని తెరకెక్కించాలని శేఖర్ కమ్ముల ఓ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇది బాలకృష్ణకు కూడా నచ్చడంతో శేఖర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య మాస్ ఇమేజ్‌ను కాపాడుతూనే .. తన క్లాస్ టచ్‌ను కోల్పోకుండా శేఖర్ కథను మలిచినట్లుగా తెలుస్తోంది. మరి బాలయ్య- శేఖర్ కమ్ముల మూవీ విషయంలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X