NBK112: టాలీవుడ్‌లో సెన్సేషనల్ కాంబో.. పాన్ ఇండియా డైరెక్టర్‌తో బాలయ్య.. 112వ మూవీ వివరాలు లీక్

ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం అలసిపోకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతోన్న ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య మరో క్రేజీ ప్రాజెక్టును చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఆ పూర్తి వివరాలేంటో మీరే చూసేయండి మరి!

భగవంత్ కేసరిగా బాలయ్య
'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి క్రేజీ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకులు దీనికి రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం భారీ కలెక్షన్లను వసూలు చేసుకుంటూ టార్గెట్ దిశగా సాగిపోతోంది.

Nandamuri Balakrishna To Team Up With Sukumar for NBK112 Movie

బాబీతో క్రేజీ ప్రాజెక్టుకు రెడీ
నటసింహా నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. ఈ మూవీని నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చే ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

మళ్లీ అతడితో.. సీక్వెలేనా?
సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ తన 110వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. దీన్ని 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లోపు బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేస్తారని అంటున్నారు. అలాగే, బోయపాటి కూడా ఓ మూవీ చేయనున్నారని టాక్.

Nandamuri Balakrishna To Team Up With Sukumar for NBK112 Movie

హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తోనూ
నందమూరి బాలకృష్ణ.. బాబీ, బోయపాటి శ్రీనుతోనే కాకుండా మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అదే సమయంలో ఆయన తనకు 'వీర సింహా రెడ్డి' వంటి కెరీర్ బెస్ట్ హిట్‌ను అందించిన గోపీచంద్ మలినేనితోనూ ఓ సినిమా చేయబోతున్నారట. దీన్ని బాలయ్య 111వ ప్రాజెక్టుగా తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

పాన్ ఇండియా డైరెక్టర్‌తో
ఇప్పటికే తన లైనప్‌లో మూడు ప్రాజెక్టులను పెట్టుకున్న నందమూరి బాలకృష్ణ.. మరో డైరెక్టర్‌కు కూడా పచ్చజెండా ఊపేశారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ సమాచారం ప్రకారం.. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. పుష్పతో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సుకుమార్ అని తెలిసింది. అవును అతడి డైరెక్షన్‌లోనే బాలయ్య తన 112వ మూవీ చేస్తున్నారట.

Nandamuri Balakrishna To Team Up With Sukumar for NBK112 Movie

ఆ సంస్థతో.. భారీ రేంజ్‌లో
నందమూరి బాలకృష్ణకు తాజాగా సుకుమార్ ఓ లైన్‌ను వినిపించగా.. అది ఆయనకు బాగా నచ్చేసిందట. దీంతో ఈ కాంబోను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వర్కౌట్ చేయబోతుందని తెలిసింది. ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇది 'పుష్ప 2'తో పాటు విజయ్ దేవరకొండ సినిమా పూర్తైన తర్వాత పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X