బోయపాటి - బాలకృష్ణ కాంబోలో మరో సినిమా.. టార్గెట్ 2024.. ఆ జానర్ లోనే?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలవడంతో వీరిద్దరి కాంబినేషన్ కి సూపర్ హిట్ కాంబినేషన్ అని పేరు వచ్చింది. అయితే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమా ఇప్పట్లో ఉండదని కాస్త ఆలస్యంగా మొదలై 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే

సింహా సినిమా

సింహా సినిమా

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి మొట్టమొదటిసారిగా సింహా అనే సినిమా చేశారు. 2009వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి లెజెండ్ అనే సినిమా చేశారు ఈ సినిమా 2014లో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది.

రికార్డులు బద్దలు

రికార్డులు బద్దలు

సరిగ్గా 2014 ఎన్నికల ముందు విడుదలైన ఈ సినిమా ఎన్నికలలో టిడిపి విజయానికి ఎంతోకొంత దోహదపడిందని పార్టీ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా అఖండ 2021 వ సంవత్సరం డిసెంబర్ రెండో తేదీన విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా అనేక ప్రాంతాల్లో రికార్డులు బద్దలు కొట్టడమే కాక కలెక్షన్లు కూడా భారీగా సాధించింది.

 రామ్ హీరోగా

రామ్ హీరోగా

అయితే ఇప్పుడు మరోసారి బాలకృష్ణ-బోయపాటి క్రేజీ నాలుగో సినిమా చేయబోతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. మరోపక్క బోయపాటి శ్రీను రామ్ హీరోగా ఒక సినిమా ఇప్పటికే ప్రకటించారు.

 2024 ఎన్నికలు టార్గెట్ గా

2024 ఎన్నికలు టార్గెట్ గా

అలా బోయపాటి రామ్ సినిమా పూర్తయ్యాక బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా పూర్తయ్యాక వీరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. ఆ సినిమా పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. 2024 ఎన్నికలు టార్గెట్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే విధంగా బోయపాటి శ్రీను ఈ సినిమా రూపొందిస్తారని తెలుస్తోంది.

కీలక పాత్రల్లో

కీలక పాత్రల్లో

బోయపాటి శ్రీను గతంలో తెలుగుదేశం పార్టీ కోసం కొన్ని సాంగ్స్ కూడా చేసిన నేపథ్యంలో ఈ సినిమా మీద దృష్టి పెట్టి ఎన్నికల టార్గెట్ గా సినిమా పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది సినిమా విడుదలైతే కానీ చెప్పలేము. ప్రస్తుతానికి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నిజ జీవిత ఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X