బాలకృష్ణ గ్రేట్ థాట్.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో కలిసి!

Recommended Video

Balakrishna Thinking To Do A Multi Starrer With Jr NTR, Kalyan Ram || Filmibeat Telugu

నందమూరి హీరోల్లో బాలకృష్ణ పంథానే వేరు. దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమను ఏలుతూ వచ్చిన బాలకృష్ణ పలు పౌరాణిక, కుటుంబ, ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో నటించారు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాతో సెంచరీ కొట్టేసిన బాలయ్య బాబు.. ప్రస్తుతం తన 105 వ సినిమా చేస్తున్నాడు. అయితే బాలయ్య మనసులో మాట అంటూ ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం..

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత రాజకీయాలతో

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత రాజకీయాలతో

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీ అయిన ఆయన ప్రస్తుతం తన 105 వ సినిమాను తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది దసరాకల్లా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య చేయబోయే తదుపరి సినిమాపై ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి.

బాలయ్య 106

బాలయ్య 106

కెఎస్ రవికుమార్ సినిమా తర్వాత తెరకెక్కనున్న బాలయ్య 106 విషయమై మొన్నటి దాకా బాలయ్య లిస్టులో డైరెక్టర్ బోయపాటి పేరు వినిపించగా, రీసెంట్ గా అ! ఫేం ప్రశాంత్ వర్మ పేరు వినిపించింది. ఇదిలా ఉండగానే తాజాగా మరింత ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో కలిసి బాలయ్య తెర షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారట.

అక్కినేని ఫ్యామిలీ లాగే

అక్కినేని ఫ్యామిలీ లాగే

అక్కినేని ఫ్యామిలీ ఎలాగైతే అంతా కలిసి 'మనం' సినిమా చేశారో అలాగే తాము కూడా ఓ సినిమా చేస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నారట. ఈ మేరకు కొడుకులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో కలిసి నందమూరి అభిమానులను ఎంటర్‌టైన్ చేయాలనేది బాలయ్య ఆలోచన అని తెలుస్తోంది.

ఎంతవరకు సాధ్యం?

ఎంతవరకు సాధ్యం?

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌, బాలకృష్ణ ఓకే సినిమాలో నటించడం అనేది నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే వార్తే. కాకపోతే ముగ్గురు స్టార్ హీరోలకు సరిపడే కథ దొరకాలి అంటే అంత సులువైన పని కాదు. ఒకవేళ దొరికినా దాన్ని చిత్రంగా మలచడంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చూడాలి మరి బాలయ్య కోరికను ఏ దర్శకుడు తీరుస్తాడా? అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X