Bigg Boss Telugu: బిగ్ బాస్ పగ్గాలు బాలకృష్ణ చేతికి, ఎప్పటి నుంచి హోస్ట్ చేయబోతున్నారంటే?

బిగ్ బాస్ తెలుగు షో ఏడు సీజన్లుగా రసవత్తరంగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ షోకు ఇప్పటి వరకు మొత్తం ముగ్గురు హీరోలు హోస్ట్ లుగా చేశారు. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని, అక్కినేని నాగార్జునలు హోస్ట్ లుగా వ్యవహరించారు. మొదటి రెండు సీజన్లకు తప్ప ఆతర్వాత వచ్చిన అన్ని సీజన్లతో పాటు ప్రస్తుతం సాగుతున్న ఏడో సీజన్ కు, ఓటీటీ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కు కూడా నాగార్జుననే యాంకర్ గా ఉన్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ షోకు సంబంధించి హోస్ట్ మారబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం రోజురోజుకూ బిగ్ షోకు ఆదరణ తగ్గుతుండడమే అని టాక్ నడుస్తోంది.

హిందీలో, తమిళ్ తో పోలిస్టే తెలుగులో రేటింగ్ చాలా తక్కువగా వస్తుందట. అయితే వీటికి కారణం హోస్ట్ గా చేసే నాగార్జుననే అని కూడా అంతా భావిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ హోస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున వ్యూస్ వచ్చాయని, అలాగే నాని హోస్ట్ గా చేసినప్పుడు కూడా టీఆర్పీ బాగానే వచ్చిందట. అయితే నాగార్జున మాత్రం ఆ స్థాయిలో హోస్ట్ చేయలేకపోతున్నారనే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏడో సీజన్ లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం వల్ల హోస్ట్ ను మార్చాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. హౌస్ లోని కంటెస్టెంట్లు ఎవరైనా తప్పు చేసినప్పుడు గట్టిగా చెప్పగలిగే వారైతే బాగుంటుందని.. ఆలోచిస్తున్నారట.

Nandamuri Balakrishna Will Host Bigg Boss Telugu Show News Goes Viral

అయితే నటసింహం నందమూరి బాలకృష్ణ అయితే బిగ్ బాస్ షోను చాలా బాగా హ్యాండిల్ చేయగలరని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజం అంటూ సోషల్ మీడియాలో కూడా ఫుల్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య బాబు కేవలం నటన, మాస్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా తనలోని యాంకరింగ్ టాలెంట్ ను కూడా అన్ స్టాపబుల్ షో ద్వారా బయటపెట్టాడు. దాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తూ.. తనకు కావాల్సిన సమాధానాలను రాబట్టుకున్నాడు. బిగ్ బాస్ షోకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తే.. కచ్చితంగా టీఆర్పీ విపరీతంగా పెరుగుతుందని అంతా అనుకుంటున్నారు.

అందుకే నెక్స్ట్ రాబోయే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ కు నందమూరి బాలకృష్ణనే హోస్ట్ గా పెట్టుబోతున్నారట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఇదే గనుక నిజం అయితే కచ్చితంగా టీఆర్పీ పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య బాబుకు ఉన్న ఫ్యాన్స్ తో పాటు బిగ్ బాస్ ప్రియులు కూడా ప్రతిరోజూ షో చూస్తారు. ముఖ్యంగా బాలకృష్ణ వీకెండ్స్ లో కంటెస్టెంట్లు పీకే క్లాసులు అయితే కచ్చితంగా అదిరిపోతాయి. కేవలం కోపమే కాకుండా ఆయన చూపించే ప్రేమ కూడా అందరికీ నచ్చుతుంది. మరి చూడాలి బాలయ్య బాబు ఈ షో చేసేందుకు వస్తారా లేదా అనేది.

Nandamuri Balakrishna Will Host Bigg Boss Telugu Show News Goes Viral

మరోవైపు అక్కినేని నాగార్జున వచ్చే ఏడాది నుంచి సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నా సామి రంగా సినిమా రిలీజ్ అయ్యాక ఇందుకు సంబంధించిన పనులతో ఫుల్ బిజీగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాగ్ అలా బిజీగా మారిపోతే.. నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ షో హోస్టింగ్ ప్లేస్ లోకి వేరే వాళ్లకు అవకాశం వస్తుంది. అలా బాలకృష్ణ చేతికి ఈ ప్రాజెక్టు వెళ్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X