బాలయ్య అభిమానులకు షాక్ .. అఖండ 2 రిలీజ్ వాయిదా? పవన్ OGకి లైన్ క్లియర్

పెద్ద సినిమాలు, క్రేజీ కాంబినేషన్ ఉన్న సినిమాలు లేక టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొంతకాలంగా కళ తప్పింది. సమ్మర్‌లోనూ ఎలాంటి రిలీజ్‌లు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు థియేటర్లు మూతపడ్డాయి. రీ రిలీజ్‌లు కొంతమేరకు థియేటర్లను ఆదుకున్నాయి. ఈ దశలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ వరకు వెళ్లగా.. ప్రభుత్వ జోక్యంతో వెనక్కి తగ్గాయి. అయితే జూలై నుంచి నవంబర్ వరకు టాలీవుడ్ నుంచి బడా సినిమాలు రానున్నాయి. దీంతో అభిమానుల ఆకలి తీరడంతో పాటు థియేటర్లు కళకళలాడతాయని భావిస్తున్నారు.

థియేటర్లపై సినిమాల దండయాత్ర
అయితే వీటిలో కొన్ని పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానుండటం, కొన్నింటికి పెద్దగా గ్యాప్ లేకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 25పై అందరి కన్ను పడింది. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 ఆ రోజున రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున సాహో ఫేజ్ సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా రిలీజ్ లాక్ చేసుకుంది. రెండు భారీ చిత్రాలు కావడంతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.

Nandamuri Balakrishna s Akhanda 2 postponed for Avoid Clash with Pawan Kalyan s OG report

మెగా vs నందమూరి
చాలా రోజుల తర్వాత నందమూరి అభిమానులు - మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. బాక్సాఫీస్ లెక్కలు, ప్రీ రిలీజ్ బిజినెస్‌పై కొన్ని ఏరియాలలో ఆల్రెడీ జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. దీంతో పవన్, బాలయ్యలలో ఎవరు విజేతగా నిలుస్తారనే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇద్దరూ నిర్మాతల క్షేమాన్ని ఆలోచించే వారు కావడంతో ఈ క్లాష్ కారణంగా ఎవరూ నష్టపోకూడదని ఇద్దరు హీరోలు భావిస్తున్నారు. అయితే ఎవరు రేసు నుంచి తప్పుకుంటారు? అలా తప్పుకుంటే హీరోల అభిమానుల ఊరుకుంటారా? అంటూ డిస్కషన్స్ నడుస్తోంది. తమకు ప్రెస్టేజ్ లాంటి ఈ విషయంలో తమ హీరోలు తగ్గకూడదని అభిమానులు కూడా ఒత్తిడి తీస్తున్నారు.

ఓటీటీలదే పెత్తనం
అయితే రెండు భారీ చిత్రాల మధ్య పోటీలో నిర్మాత నలిగిపోకూడదనే ఉద్దేశంతో అఖండ 2నే వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం లేదని కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ అది నిర్మాతను దృష్టిలో పెట్టుకుని కాదని ఓటీటీ సంస్థల ఒత్తిడి మేరకు అని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ సంస్థల చేతుల్లోనే తెలుగు సినిమాల రిలీజ్‌లు ఆధారపడి ఉన్నాయి. ఓటీటీ సంస్థ ఎప్పుడు స్లాట్ ఉంటే అప్పుడే బొమ్మ వేయాల్సి ఉంది. ఇందుకు నిర్మాతలు కూడా ఎదురుచెప్పే స్థాయిలో లేరు. ఓటీటీ డీల్ విషయంలో బేరాలు కొలిక్కి రాకపోవడం వల్లనే అఖండ 2 రిలీజ్ వాయిదా పడిందని పుకార్లు వస్తున్నాయి.

ఓజీకి లైన్ క్లియర్ అయినట్లేనా?
మరో వెర్షన్ ప్రకారం పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 విడుదల కానుండటంతో ఎలాంటి తప్పులు చేయకూదని దర్శకుడు బోయపాటి శ్రీను భావిస్తున్నారు. దీనిలో భాగంగా గానే వీఎఫ్ఎక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించాలని భావిస్తున్నారట. అలాగే కొంత షూటింగ్ పనులు కూడా పెండింగ్‌లో ఉండటంతో అవన్నీ పూర్తి చేసిన తర్వాత సినిమా రిలీజ్ కానుందని ఫిలింనగర్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ కారణాలతో అఖండ 2 విడుదల వాయిదా పడినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ బాలయ్య సినిమా కనుక వాయిదా పడితే పవన్ కళ్యాణ్ ఓజీకి లైన్ క్లియర్ అయినట్లే. మరి నిజంగానే అఖండ 2 వాయిదా పడిందా? లేక సెప్టెంబర్ 25న ఓజీతో పాటు బరిలోకి దిగుతుందా అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X