బాలయ్య రికార్డు బ్రేకింగ్ రెమ్యూనరేషన్.. ‘అఖండ 2'కు ఎన్ని కోట్లు అంటే?
Nandamuri Balakrishna's Remuneration: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫ్యాన్స్ కు పండుగే, మాస్ ఎనర్జీ, సెలబ్రేషన్స్ అన్నీ మామూలు స్థాయిలో ఉండవు. 50 ఏళ్ల కెరీర్‌లో బాలయ్య ఎన్నో వేరువేరు పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. పవర్ పుల్ డైలాగులు, యాక్షన్, ఎమోషన్ అన్నింటిని ప్యాకేజీగా అందిస్తాడు బాలయ్య. అందుకే అప్పటి అభిమానులకే కాదు, కొత్త తరం ప్రేక్షకులకూ బాలయ్య ప్రత్యేకమైన అట్రాక్షన్. అయితే.. తాజాగా నందమూరి బాలకృష్ణ (NBK) పారితోషికం చర్చనీయంగా మారింది. 'అఖండ-2 : తాండవం' సినిమా కోసం.. తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారంటే?
నందమూరి బాలక్రిష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో మాస్ ప్రేక్షకుల నాడిని ఎలా పట్టుకోవాలో తెలిసిన కాంబో. వీరి కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ'సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను ఊచకోత కోశాయి. ఇలా వరుస విజయాలతో ఓ బ్రాండ్ సెట్ చేశారు. అలాంటి సక్సెస్ పుల్ కాంబో ఇప్పుడు మరింత జోష్ తో 'అఖండ 2: తాండవం' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. రుద్ర అవతారంలో బాలయ్య తెరపై చేసిన పూనకాల్ని మళ్లీ చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

'అఖండ 2: తాండవం' మాస్ ఎంటర్‌టైనర్‌ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఎస్.ఎస్.తమన్. అందిస్తున్నారు. ఇప్పటికే 'అఖండ'కు ఆల్రెడీ కల్ట్ స్టేటస్ తెచ్చిన ఆయన స్కోర్, ఈ సీక్వెల్‌లో మరింత మాస్ ఎమోషన్‌ను అందించబోతుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అభిమానులను మంచి రెస్పాన్స్ వస్తుంది. విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఎలివేట్ చేయడానికి 'అఖండ 2: తాండవం'ను 2D, 3D రెండు ఫార్మాట్లలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 5, 2025న ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. మళ్లీ బాలయ్య బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న హాట్ న్యూస్ .. నందమూరి బాలకృష్ణ (ఎన్బీకే) రెమ్యూనరేషన్. బాలకృష్ణ తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ సాధించినట్టు తాజా సమాచారం. 'అఖండ-2 : తాండవం' సినిమా కోసం.. బాలయ్య ఏకంగా 45 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట.
మరోవైపు.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా 'అఖండ-2' కోసం రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. 2021లో వచ్చిన 'అఖండ' సూపర్ హిట్ సక్సెస్ తర్వాత బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ మళ్లీ కలిసింది. అయితే గతేడాది రామ్ పోతినేని నటించిన 'స్కంద' ఘోరమైన ఫ్లాప్ అయినా బోయపాటి మార్కెట్ మాత్రం కొట్టిపారేయలేకపోయిందని ఈ వార్త నిరూపిస్తోంది.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'అఖండ-2' బడ్జెట్ రూ.100 కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను గతంలో తీసుకున్న రెమ్యునరేషన్ కంటే దాదాపు రెట్టింపు అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











