Balayya: బాలయ్య సంచలన నిర్ణయం.. మోక్షజ్ఞ బాధ్యతలు ఆ పాన్ ఇండియా డైరెక్టర్ చేతికి?
నందమూరి నటసింహం అభిమానులు.. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏపీ ఎలక్షన్స్ తర్వాత నందమూరి మోక్షజ్ఞ.. సినీ ఆరంగేట్రం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక మోక్షజ్ఞ బాధ్యతలను పాన్ ఇండియా డైరెక్టర్ చేతిలో బాలయ్య పెట్టినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఓ ఇంట్రిస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు సినీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య భగవంత్ కేసరి సినిమా షూటింగ్ లోకేషన్ లో కూడా మోక్షజ్ఞ కనిపించాడు. శ్రీలీలతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఇక ఆ లుక్ లో మోక్షజ్ఞ భలే ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపించాయి.

ఒకప్పుడు లావుగా ఉండే మోక్షజ్ఞ.. సినిమాల కోసమే తగ్గినట్లు తెలుస్తోంది. అంతే కాదు హ్యాండ్సమ్ లుక్ లోకి వచ్చేశాడు. ఇక ఇదిలా ఉంటే.. నందమూరి బాలయ్య కొడుకు సినిమా కోసం తెగ ప్రయాత్నాలు మొదలు పెట్టారట. కొడుకును లాంచ్ చేసేందుకు పాన్ ఇండియా డైరెక్టర్ ను పట్టినట్లు నెట్టింట్లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆ దర్శకుడు ఎవరో కాదు... ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేని దర్శకుడు రాజమౌళితో మోక్షజ్ఞ పాన్ ఇండియా సినిమా తీస్తే.. లైఫ్ సెటిల్ అయిపోయందని బాలయ్య ఆలోచన అని తెలుస్తోంది.
ఇక రాజమౌళి లాంటి దర్శకుడు కొత్త హీరోలతో సినిమా తీయాలంటే కష్టమే. ఆయన ఎక్కువగా పాపులర్ హీరోలతోనే సినిమా తీస్తాడు. మరి రాజమౌళి ఆ మచ్చను బ్రేక్ చేయడానికి మోక్షజ్ఞతో సినిమా చేస్తాడా అని కొంత మంది అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ఈ న్యూస్ మాత్రం వైరల్ గా మారింది. ఇదే కనుగ నిజం అయితే.. మోక్షజ్ఞ లక్కు తోక తొక్కినట్లే అవుతుంది.

ఇక ఈ విషయం మీదనే బాలయ్య.. దర్శకుడు రాజమౌళిని కలిశారని తెలుస్తోంది. రాజమౌళి ఏకంగా బాలయ్య ఇంటికి వెళ్లి మీట్ అయి.. ఈ విషయం మీద చర్చ జరిపారట. బాలయ్య ఫోన్ చేస్తేనే రాజమౌళి ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞను రాజమౌళి దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటూ బాలయ్య ప్రత్యేకంగా కోరారని సమాచారం.
దీంతో రాజమౌళి కూడా ఆ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్లు ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబు సినిమా పనిలో ఉన్నారు. మరి ఎప్పుడు మోక్షజ్ఞతో సినిమా తెరకెక్కిస్తారు.. అసలు ఈ వార్తలో నిజం లేదని కొంత మంది అంటున్నారు. ఒకవేళ ఈ వార్త నిజం అయితే మాత్రం పాన్ ఇండియా కాదు మొదటి సినిమాతోనే గ్లోబల్ స్ధాయి రికార్డులు కొట్టి ఆస్కార్ అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు మోక్షజ్ఞ అంటున్నారు ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











