Bhagavanth Kesari: బాలయ్యకి ప్రమోషన్.. ఈసారి గ్లోబల్ స్థాయిలో సింహం దిగుతోంది..!
నందమూరి బాలయ్యను ఫ్యాన్స్ ముద్దుగా మొదట్లో యువరత్న అంటూ పిలుచుకునే వారు.. ఆ తర్వాత ఆయన్నీ నట సింహం అంటూ పిలిచారు. ఇక ఇప్పుడు ఆయన నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాతో ఆయన బిరుదు మారబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య బిరుదును మార్చేశారని తెలుస్తోంది. అసలు ఆ బిరుదు ఏంటి.. ఎందుకు మార్చాల్సి వచ్చింది.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అభిమాన హీరోలకు బిరుదులు పెట్టుకోవడం కామన్. మెగాస్టార్, సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్, గ్లోబర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అంటూ... ఇలా మన హీరోలకు బిరుదులు పెట్టుకుంటాం. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఒకప్పుడు సుప్రీం హీరో అని ఉండేది.. ఇక కొంత కాలం తర్వాత ఆయన మెగా స్టార్ గా మార్చుకున్నారు. అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అని ఉండేది.. ఇక పుష్ప సినిమాలో ఆయన ఐకానిక్ స్టార్ గా మార్చుకున్నారు.

ఇక అప్పటి నుంచి తమ అభిమానులు మెగా స్టార్, ఐకానిక్ స్టార్ అంటూ పిలుచుకుంటారు. ఇప్పుడు ఇదే బాటలో బాలయ్య చేరిపోయారు. ఆయన తండ్రి ఎన్టీ రామారావుకు నటరత్న అనే బిరుదు ఉండేది. ఆయన కుమారుడు కాబట్టి.. యువరత్నగా ఫ్యాన్స్ పిలుచుకున్నారు. అలా కొంత కాలం గడిచింది. వయసు మీద పడినా యువరత్న అంటే బాగోదు కాబట్టి.. ఇక బిరుదు మార్చుకోవాలనుకున్నారు.
అలా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమాతో ఆయన నట సింహంగా పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక అప్పటి నుంచి బాలయ్య బిరుదు నట సింహంగా మారిపోయింది. యువరత్న, నటసింహం బిరుదులు కాకుండా బాలయ్యకు కొన్ని సినిమాల్లో గోల్డ్ స్టార్, యుగా స్టార్, నటరత్న వంటి బిరుదులు చేర్చారు మేకర్స్. కానీ అవేవి.. అంతగా క్లిక్ కాలేదు. ఇక ప్రస్తుతానికి బాలయ్యను నటసింహంగా అభిమానులు పిలుచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే బాలయ్య బిరుదు మారినట్లు తెలుస్తోంది. ఈ సారి ఆయనకు ప్రమోషన్ వచ్చిందని అర్థం అవుతుంది. బాలయ్య నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ ఆగర్వాల్ నటిస్తుంది. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.

ఇక భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా జరుపుకుంది ఈ మూవీ. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బాలయ్య మునుపెన్నడూ కనిపించని విధంగా ఉన్నారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టారు. ఇక ఈ సినిమాతో బాలయ్య బిరుదు మారిపోతుందని అర్థం అవుతుంది. ఈ సినిమాలో బాలయ్య బిరుదు గ్లోబల్ లయన్ గా మార్చారట. ఇక ఈ సినిమాతో బాలయ్యను నట సింహం అని కాకుండా గ్లోబల్ లయన్ బాలయ్య అని పిలవాలి అనమాట. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











