బాలకృష్ణకు ఎందుకీ సాహసం..? ఫ్యాన్స్ గగ్గోలు...?
సుధాకర్ నాయుడు అలియాసి జీవీ అనేక చిత్రాల్లో ప్రాధాన్యమున్న విలన్ పాత్రల్లో మెప్పించాడు. ఆ తర్వాత నితిన్ తో హీరో అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ హీరోగా రంగా ది దొంగ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇదీ ఘోరంగా పరాజయం పాలైంది. ఇలాంటి ఘోర పరాజయాలు చవిచూసిన జీవీ చెప్పిన కథను బాలయ్య ఓకే చేశాడంటే అభిమానులు నమ్మలేకుండా ఉన్నారు. ఇది కేవలం గాసిప్ మాత్రమే అంటూ కొట్టిపారేస్తున్నారు. అయితే రెండు చిత్రాలు ఫ్లాపయినంత మాత్రాన జీవీకి బాలయ్యను డైరెక్షన్ చేసే సత్తా లేదని కొట్టిపారేయలేం. ఒకవేళ ఈ గాసిప్పే నిజమైతే... జీవీ బాలయ్యకు ఎలాంటి కథ చెప్పాడబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.
బాలయ్య బాబు తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ దర్శకుడితో ఎందుకు చేస్తున్నాడా.. బాబూ అనిపించేలా ఉంటాయా.. నిర్ణయాలు. అయితే ఆలోచించకుండా బాలకృష్ణ ఎలాంటి నిర్ణయాలు తీసుకోడని అభిమానుల నమ్మకం. తాజాగా ఫిలింనగర్ లో వినిపిస్తున్న ఓ విషయంతో అభిమానులు కంగారు పడుతున్నారట. విలన్ వేషాలు వేసుకునే జీవీ ఈ మధ్యే డైరెక్టర్ గా అవతారమెత్తాడు. జీవీ దర్శకత్వంలో బాలయ్య నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో ఫాస్ట్ గా సంచరిస్తోంది. అయితే ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











