అల్లు అర్జున్ పెళ్ళి కంటే గ్రాండ్ గా చేయాలని నందమూరి హీరోస్ టెన్షన్..!
అల్లు అర్జున్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి మండపం వద్ద మరీ తిరునాళ్ల తీరు కనిపించినా కానీ మొత్తం మీద ఏడు రోజుల పెళ్లి అర్జున్ ఘనంగా చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు మరో స్టార్ హీరో జూ ఎన్టీఆర్ పెళ్లిపై కాన్సన్ ట్రేషన్ మళ్ళింది. అతని పెళ్ళి ఎలా జరుగుతుందనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బన్నీలానే ఎన్టీఆర్ కూడా మొత్తం మీడియానీ, అభిమానుల్నీ పిలిపించుకుని కుటుంబ సభ్యుల నడుమ చేసుకుంటాడా అని చర్చించుకుంటున్నారు. సౌత్ ఇండియాలో కాస్ట్ తీ పెళ్లి తమ బన్నీదేనని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఎన్టీఆర్ పెళ్లి అంత కంటే వైభవంగా జరుగుతుందని నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సినిమాల విషయంలోనే కాక పెళ్లి తంతులోను 'రికార్డులే" ఫ్యాన్స్ కి ముఖ్యం. మరి వారి కోరిక పట్టించుకుంటాడా?బన్నీ పెళ్లిని తలదన్నేలా చేసుకుంటాడా? వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











