ఇంతకీ నందమూరి హీరోకు రిలీఫ్ వచ్చినట్లేనా?
చాలా కాలంగా సరైన గుర్తింపు లేకుండా ఉన్న తారకరత్న కు అమరావతి చిత్రం రిలీఫ్ ఇచ్చినట్లే చెప్తున్నారు. సినిమా పెద్దగా బాగోలేకపోయినా సోకోపాత్ గా తారకరత్న బాగా చేసాడని అంటున్నారు. అలాగే అతను ఇప్పుడు ఒళ్ళు చేసి కాస్త చూడ్డానికి బాగున్నాడంటూ ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. అయితే ఈ ప్రశంసలు అన్నీ వర్కవుట్ అయి ఆఫర్స్ గా మారి బిజీ అయితేనే ఫలించినట్లు అంటున్నారు. ఇక తారకరత్న కాడా ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎటువంటి పాత్ర అయినా చెయ్యటానికి రెడీ అనీ,అయితే అది కథలో ప్రాధాన్యమైనదైతే ఆలోచించకుండా ఒప్పుకుంటానని అంటున్నారు. అంటే హీరోలకు తమ్ముళ్ళుగాను, విలన్ పాత్రలూ వెయ్యటానికి రెడీ అన్నమాట. నిజంగా మైండ్ సెట్ మారితే గ్యారెంటీగా మంచి వర్త్ ఫుల్ ఆఫర్స్ వస్తాయని పరిశ్రమ వర్గీయులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం అమరావతి ఎంత వరకూ తారకరత్నకు లైఫ్ ఇస్తుందో..
తారకరత్న అమరావతి రవిబాబు భూమిక గద్దె సిందూర స్నేహ గర్భణి వెంకటాద్రి tarakaratna amaravathi bhoomika sneha venkatadri


Click it and Unblock the Notifications