కల్యాణ్ రామ్ సెన్సేషనల్ మల్టీస్టారర్: నందమూరి హరికృష్ణ పాత్రలో ఆ స్టార్ హీరో

గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నాయి. అందుకే ప్రయోగాత్మకంగా వచ్చే చిత్రాలు సక్సెస్ అవుతున్నాయి. అన్నింటికీ మించి మల్టీస్టారర్ మూవీలకు ఆడియెన్స్ జై కొడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎక్కువగా అలాంటి సినిమాలు రూపొందుతోన్నాయి. వీటిలో ఎక్కువ శాతం హిట్లుగా నిలుస్తుండడంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరిన్ని చిత్రాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నందమూరి కల్యాణ్ రామ్ మరో స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడని తెలిసింది. ఆ సంగతులు మీకోసం!

ఒక హిట్.. ఒక డిజాస్టర్‌తో:చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న నందమూరి కల్యాణ్ రామ్.. గత ఏడాదిలో 'బింబిసార' అనే చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఊపులోనే ఈ ఏడాది 'అమిగోస్' అనే సినిమాను చేశాడు. కానీ, ఇది మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఫలితంగా ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

Nandamuri Kalyan Ram And Vijay Sethupathi Multi Starrer with Pavan Sadineni

డెవిల్‌గా రాబోతున్నాడు:నందమూరి కల్యాణ్ రామ్ ఇప్పుడు 'డెవిల్' అనే సినిమాను చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాంన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించబోతున్నారు.

కొత్త సినిమాపై ప్రచారం:హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ జోష్‌ను చూపిస్తోన్న నందమూరి కల్యాణ్ రామ్ నటించే కొత్త సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. దీన్ని ఫలానా దర్శకుడితో చేయబోతున్నాడని చాలా రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది కొత్త, సీనియర్ దర్శకుల పేర్లు కూడా తెరపైకి వస్తోన్నాయి.

Nandamuri Kalyan Ram And Vijay Sethupathi Multi Starrer with Pavan Sadineni

క్రేజీ డైరెక్టర్‌తో సినిమా:ఒకటి పట్టాలపై ఉండగానే మరో ప్రాజెక్టును చేసుకుంటూ వెళ్తోన్న కల్యాణ్ రామ్.. తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో చేయబోతున్నాడని తెలిసింది. గతంలో 'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి' అనే సినిమాలు చేసిన ఈ దర్శకుడు.. ఇటీవలే 'దయా' వెబ్ సిరీస్‌తో సత్తా చాటాడు. ఇప్పటికే అతడు కల్యాణ్ రామ్ కోసం ఓ క్రేజీ స్టోరీని రెడీ చేశాడట.

ఆ హీరోతో మల్టీస్టారర్:నందమూరి కల్యాణ్ రామ్ నటించబోయే ఈ సినిమా గురించిన ఓ సంచలన న్యూస్ తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడని తెలిసింది. ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారట. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుందని కూడా టాక్.

Nandamuri Kalyan Ram And Vijay Sethupathi Multi Starrer with Pavan Sadineni

హరికృష్ణ పాత్రలోనే:వాస్తవానికి 'సావిత్రి' సినిమా చేసిన తర్వాతనే నందమూరి కల్యాణ్ రామ్‌తో పవన్ సాదినేని ప్రాజెక్టు చేయాలని అనుకున్నాడు. ఈ కథలో నందమూరి హరికృష్ణకు కూడా ఓ పాత్రను రాసుకున్నాడు. కానీ, ఆయన మరణించడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇక, ఇప్పుడు ఇదే పాత్రలో విజయ్ సేతుపతిని పెట్టి సినిమాను రూపొందిస్తున్నట్లు మరో న్యూస్ కూడా లీకైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X