పెళ్లి పీటలు ఎక్కబోతున్న నందమూరి హీరోయిన్... త్వరలోనే ప్రియుడితో కలిసి 7 అడుగులు!

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సెలబ్రెటీలు చాలా మందే ఉన్నారు. మొన్నటి వరకు హీరోలు అందరూ ఓ ఇంటి వారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. నందమూరి హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అది కూడా ఆ హీరోయిన్ తన ప్రియుడితో ఏడు అడుగులు వేయబోతుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ భామ.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే కల్యాణ్ రామ్ నటించిన ' బింబిసార ' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అలా ఆ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది.

Nandamuri Kalyan Ram Devil Heroine Samyuktha Menon is Going To Marry Her Boy Friend News Goes Viral

ఇక తమిళ హీరో ధనుష్ నటించి ' సార్ ' చిత్రంలో సంయుక్త మీనన్ ను హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయందనే చెప్పాలి. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అంతే కాదు వరుసగా సినిమాలు చేస్తూ.. సక్సెస్ అందుకుంది. ఇక ఎన్నో ఏళ్లుగా హిట్ లేక సతమతవుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు కూడా ఈ భామే హిట్ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

Nandamuri Kalyan Ram Devil Heroine Samyuktha Menon is Going To Marry Her Boy Friend News Goes Viral

'విరూపాక్ష ' సినిమాతో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు సూపర్ హిట్టును ఇచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి.. తన నటనతో మెప్పించింది. ఇక వరుస హిట్స్ తర్వాత.. ఇప్పుడు మళ్లీ కల్యాణ్ రామ్ తో కలిసి డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ భామ. ఈ సినిమా డిసెంబర్ 29న పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్న బ్యూటీ.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పేసిందట. ఇక వారు కూడా ఓకే చేప్పినట్లు తెలుస్తుంది. అయితే సంయుక్త పెళ్లి చేసుకోబోయేది వేరే మతానికి చెందిన అబ్బాయని తెలుస్తోంది.

Nandamuri Kalyan Ram Devil Heroine Samyuktha Menon is Going To Marry Her Boy Friend News Goes Viral

దీంతో పెళ్లి తర్వాత తన పేరు చివర ఉన్న ట్యాగ్ కూడా తీసేస్తుందని సమాచారం. అంతేకాకుండా సంయుక్త 'డెవిల్' సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఓకే చేయలేదని.. దీన్ని బట్టి చూస్తే.. ఈ సినిమా తర్వాత ఈ భామ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని సినిమా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ...నెట్టంట వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మేల్ ఫ్యాన్స్ మాత్రం నువ్వు హ్యాండ్ ఇచ్చావా అంటూ తలలు పట్టుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X