ఆచార్య ఎఫెక్ట్.. జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబో సెట్టయ్యే ఛాన్స్.. కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ అనే పదం కాకుండా ఫ్యామిలీ మల్టీస్టారర్ అనే కొత్త కామెంట్స్ వస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు సింగిల్ ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కు మాములుగా ఉండదు. మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీ ఒక ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీతో పాటు నందమూరి ఫ్యామిలీ కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మల్టీస్టారర్ హవా..
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. స్టార్ హీరోలు కుర్ర హీరోలు వారి మధ్య అభిప్రాయ బేధాలు లేకుండా సింగిల్ స్క్రీన్ లో కనిపించడానికి స్టార్ డమ్ ని పక్కనపెట్టేస్తున్నారు. ఇక ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతుండడం ఆడియెన్స్ కి కొత్త తరహా థ్రిల్ ని అందిస్తోంది.

ఆచార్య ఎఫెక్ట్..
కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆ సినిమాలో మెగా తనయుడు రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఆచార్య సినిమా వలన చాలా మంది స్టార్ హీరోలు వారి కుటుంబ సభ్యులతో కూడా మంచి యాక్షన్ సినిమా చేయాలని ఒక ప్లాన్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నందమూరి కాంబినేషన్
ఇక అందరి చూపు ఇప్పుడు నందమూరి ఫ్యామిలీపై మళ్లింది. అక్కినేని, మెగా, దగ్గుబాటి ఫ్యామిలీలో చాలా వరకు ప్రతి ఒక్కరి సినిమాలో ఎదో ఒక విధంగా కనీసం గెస్ట్ రోల్స్ అయినా ఉంటాయి. కానీ ఇంతవరకు నందమూరి ఫ్యామిలీలో తారక్, బాలయ్య, కళ్యాణ్ రామ్ లలో ఎవరు కూడా వారి కుటుంబ సభ్యుల సినిమాల్లో నటించింది లేదు.

క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..
గతంలో ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మనం సినిమా చూసిన తరువాత తమకి కూడా అలాంటి సినిమా చేస్తే బావుంటుందని అనిపించిందని చాలా సార్లు తారక్ తో ఈ విషయంపై మాట్లాడుకున్నట్లు చెబుతూ.. బాబాయ్, తమ్ముడు తారక్ తో కలిసి ఒక మంచి సినిమా చేయాలని ఉందని కళ్యాణ్ రామ్ చెప్పాడు.
Recommended Video

సెట్టయ్యే ఛాన్స్..
ఇక ఇప్పుడు ఆచార్య సినిమా కారణంగా అలాంటి నందమూరి కాంబినేషన్ కూడా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా అనుభవం ఉన్న కళ్యాణ్ రామ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తోనే కలిసి ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. అనుభవం ఉన్న సీనియర్ రైటర్స్ వద్ద ఉన్న కథలపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని నందమూరి మల్టీస్టారర్ వస్తే గనక టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు మొదలైనట్లే..


Click it and Unblock the Notifications











