For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మా’ అధ్యక్ష రేసులో నందమూరి హీరో: ఆయన కోరిక మేరకే ఈ నిర్ణయం.. ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని నటులంతా ఏకమై కొన్నేళ్ల క్రితం 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరంభంలో ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఎవరో ఒక ప్రముఖుడిని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకునే వారు. రాను రానూ ఆ పద్దతి మారిపోవడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇక, ఈ ఏడాది మా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అధ్యక్ష పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఇప్పుడు నందమూరి హీరో కూడా ఈ జాబితాలో చేరినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఆ సంగతులు మీకోసం!

  అప్పుడు ఎన్నికల కోసం ఇప్పుడే

  అప్పుడు ఎన్నికల కోసం ఇప్పుడే

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల సమస్యల పరిష్కారం కోసం.. పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసేందుకు ఏర్పాటైన సంఘమే ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'. ఇందులో నిర్ణీత కాల వ్యవధికి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక అధ్యక్షుడితో పాటు ప్యానెల్ సభ్యులను ఎన్నుకుంటారు. ఇక, ఈ సెప్టెంబర్‌లో జరిగే మా ఎన్నికలకు అప్పుడే హడావిడి మొదలైంది.

  అధ్యక్ష పదవికి నలుగురు ఫైటింగ్

  అధ్యక్ష పదవికి నలుగురు ఫైటింగ్

  కొంత కాలంగా ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' అధ్యక్ష పదవికి రెండు బలమైన వర్గాలు పోటీలో నిలుస్తున్నాయి. అయితే, ఈ సారి మాత్రం ఇండస్ట్రీ నుంచి ఏకంగా నలుగురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. కొద్ది రోజుల్లో జరగబోతున్న ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలు పోటీ పడబోతున్నారు. దీంతో ఈ సారి పోటీ రసవత్తరంగా సాగే పరిస్థితులు ఉన్నాయి.

  ఏ అభ్యర్ధికి ఎవరు సపోర్ట్ చేశారు?

  ఏ అభ్యర్ధికి ఎవరు సపోర్ట్ చేశారు?

  ‘మా' అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న నలుగురికి కొందరు ప్రముఖులు సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ, మంచు విష్ణుకు సీనియర్ నటులతో పాటు నందమూరి కుటుంబం మద్దతు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, జీవితా రాజశేఖర్‌కు లేడీ ఆర్టిస్టులు, కొత్త నటులు.. హేమకు చిన్న ఆర్టిస్టుల మద్దతు ఉందనే టాక్ బాగా వినిపిస్తోంది.

  సాయి కుమార్ కూడా నిలిచేనా?

  సాయి కుమార్ కూడా నిలిచేనా?

  ఇప్పటికే ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' అధ్యక్ష పదవికి ఏకంగా నలుగురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనే డైలాగ్ కింగ్ సాయి కుమార్. అవును.. ఈ సీనియర్ హీరో కూడా కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికి ప్రకటన మాత్రం రాలేదు.

  అధ్యక్ష రేసులో నందమూరి హీరో

  అధ్యక్ష రేసులో నందమూరి హీరో

  తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకతే వేరు. ఆ కుటుంబానికి ఆద్యుడు ఎన్టీఆర్‌ను టాలీవుడ్‌కు పెద్దగా కొలిచేవారు. ఆ తర్వాత బాలకృష్ణకు ఆ స్థాయిలో గౌరవం దక్కుతోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సారి జరగబోయే ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల్లో హరికృష్ణ కుమారుడు, నందమూరి కల్యాణ్ రామ్ కూడా పోటీ పడుతున్నాడట.

  ఆయన కోరిక మేరకే ఈ నిర్ణయం

  ఆయన కోరిక మేరకే ఈ నిర్ణయం

  టాలీవుడ్‌లో చాలా కాలంగా హీరోగా వెలుగొందుతోన్న కల్యాణ్ రామ్.. ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అదే సమయంలో నిర్మాతగానూ మారి కొన్ని సినిమాలను నిర్మించాడు. ఇప్పుడు కూడా వరుసగా హీరోగా, నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నందమూరి బాలయ్య కోరిక మేరకు కల్యాణ్ రామ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాని ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  ‘మా' ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్

  ‘మా' ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్

  ప్రతీసారి జరిగే ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీ సపోర్టు కోసం పోటీ చేసే అభ్యర్ధులంతా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక, ఈ సారి మంచు విష్ణుకు వాళ్ల మద్దతు ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కల్యాణ్ రామ్ పోటీ చేస్తున్నాడన్న వార్త బయటకు రావడం కలకలం రేపుతోంది. అదే జరిగితే ఈ సారి ఎన్నికల మరింత రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉంటాయి.

  English summary
  Movie Artist Association 2021 Elections will be Held on September. In This Fight Prakash Raj, Vishnu Manchu, Jeevitha And Hema Paricipating for President Post. Now Nandamuri Kalyan Ram Also Took Place in That List.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X