‘F3’లో నందమూరి హీరో: ఊహించని పాత్రకు గ్రీన్ సిగ్నల్.. ఆ ఇద్దరు స్టార్లను ఇరుకున పెడుతూ!
కొన్నేళ్లుగా తెలుగులో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఇప్పుటి ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో మార్పులు రావడంతో.. హీరోలు కూడా ఇలాంటి సినిమాల్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే పాత్రను బట్టి ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నారు. ఇలా రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో 'F2' ఒకటి. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ కూడా వస్తుంది. ఇందులో నందమూరి హీరో కూడా భాగం అయ్యాడని ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నుంచి ఫన్ అండ్ ఫ్రస్టేషన్
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు.

సంక్రాంతి విన్నర్‌గా ఇద్దరు అల్లుళ్లు.. లాభాలు
సంక్రాంతి అల్లుళ్లు అంటూ వచ్చిన రెండేళ్ల క్రితం వచ్చిన 'F2' భారీ విజయాన్ని అందుకుంది. వాస్తవానికి ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పొంగల్ సెలవుల్లో హవాను చూపిస్తూ ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. ఆ ఏడాది విడుదలైన సినిమాలు అన్నింటిలోనూ ఎక్కువ లాభాలు దీనికే వచ్చిన విషయం తెలిసిందే.

సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. F3 మొదలైంది
'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సూపర్ డూపర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా 'F3'ని రూపొందించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిపోయింది. అయితే, దర్శకుడు అనిల్ రావిపూడి వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఇది కాస్తా ఆలస్యం అయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'F3' పేరిట ఈ సినిమాను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా ప్రారంభించేశారు.

F3లో ఇద్దరు కాదు... ముగ్గురు హీరోలని టాక్
'F2'లో ఇద్దరు హీరోలు నటించడంతో, దానికి సీక్వెల్‌గా రాబోతున్న 'F3'లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సహా ముగ్గురు స్టార్లు ఉంటారని జోరుగా ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే మాస్ మహారాజ రవితేజ, రామ్, సాయి ధరమ్ తేజ్ సహా ఎంతో మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లతో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అసలు సమస్య అదే.. కథ పాయింట్ ఇదేనంటూ
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ వస్తుంది.

‘F3'లో నందమూరి హీరో: ఊహించని పాత్రకు సై
ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న F3లో నందమూరి హీరో కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దాదాపు పది నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశంలో ఇద్దరు హీరోలు వెంకటేష్, వరుణ్‌ను అతడు ఇరుకున పెడతాడని అంటున్నారు.

హీరో అందుకే ఒప్పుకున్నాడని చెబుతున్నారు
అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేసింది నందమూరి కల్యాణ్ రామే. 'పటాస్' సినిమాతో వీళ్లిద్దరూ కలిశారు. ఈ సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్. మరోవైపు, వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలో కల్యాణ్‌కు దీనితోనే హిట్ వచ్చింది. ఈ కారణంగానే F3లో నటించేందుకు ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











