ఎన్టీఆర్ ప్రాజెక్టులో భాగం కాబోతున్న కళ్యాణ్ రామ్! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
హీరోగా, నిర్మాతగా రెండు విభిన్న కోణాల్లో దూసుకుపోతున్నాడు నందమూరి కల్యం రామ్. తమ్ముడు ఎన్టీఆర్ సినిమాను నిర్మించడమంటే ఆయనకు అమితమైన ఆసక్తి. అంతకుముందు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'జై లవకుశ' సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమా నిర్మాణంలో భాగం కావాలని సన్నాహాలు చేస్తున్నారట.
ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈ సినిమా పూర్తికాగానే కెజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో రానున్న సినిమా చర్చల దశలోనే ఉందని.. అన్నీ కుదిరితే 2020 చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని మైత్రి నిర్మాత ఒకరు అన్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో తాను కూడా భాగం అవుతానని పేర్కొంటూ మైత్రి నిర్మాతలకు కళ్యాణ్ రామ్ ప్రపోసల్ పెట్టారట. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా అంటే భారీ బడ్జెట్ కేటాయించాలి కాబట్టి మైత్రి వారు కూడా కళ్యాణ్ రామ్ జాయింట్ ప్రపోసల్ అంగీకరించే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్.. 'ఎంత మంచి వాడవురా' సినిమాతో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ RRR షూటింగ్ లో చురుకుగా పాల్గొంటున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ బడా మల్టీస్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జులై 30 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











