బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో నందమూరి హీరో కన్ఫర్మ్
ఆరెంజ్ చిత్రం డిజాస్టర్ టాక్ తో ఒక్కసారిగా తెరమరుగైన బొమ్మరిల్లు భాస్కర్ త్వరలో మరో తెలుగు సినిమా చేయనున్నాడని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. భాస్కర్ కి వరస ఫ్లాపుల్లో ఉన్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అవకాశమిచ్చినట్లు సమాచారం. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవటానికి భాస్కర్ దర్సకత్వంలో చేయటమే మార్గమని కళ్యాణ్ రామ్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. ఈ మేరకు భాస్కర్ చెప్పిన లైన్ ఓకే చేసి అడ్వాన్స్ ఇచ్చి స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నాడని తెలుస్తోంది. పరుగు వంటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్తానని మాట ఇచ్చాడని, కళ్యాణ్ రామ్ చాలా ఆనందంగా ఉన్నాడని అంటున్నారు. ఇక కత్తి సినిమా పరాజయంతో అప్పటివరకూ అతనొక్కడే సినిమా పేరు చెప్పి ముందుకు వెళ్ళిన కళ్యాణ్ రామ్ రూట్ మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా ఎప్పటిలాగనే నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











