నందమూరి మోక్షజ్ఞకు అలాంటి ప్రాబ్లం.. సినిమాల్లోకి రాకుండా అడ్డుకునేది ఆయనేనా!

నందమూరి మోక్షజ్ఞ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. దీనికి కారణం ఈ కుర్రాడు నటసింహా నందమూరి బాలకృష్ణ కుమారుడు కావడమే. అంతేకాదు, చాలా కాలంగా ఈ నందమూరి చిన్నోడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై రకరకాల ప్రచారాలు జరుగుతోన్నాయి.

ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నందమూరి మోక్షజ్ఞకు ఓ సమస్య ఉన్నట్లు షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలేంటా ప్రాబ్లం? దానికి సంబంధించిన వివరాలను మీరే చూడండి!

Nandamuri Mokshagna Astrology Gone Hot Topic In Telugu Film Industry

మూవీల్లోకి బాలయ్య కొడుకు
తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది స్టార్లు తమ పిల్లలను సినిమాల్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలానే తన కొడుకు మోక్షజ్ఞను కూడా ఇంట్రడ్యూస్ చేస్తానని నందమూరి బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి అతడి ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చేస్తున్నారు. కానీ, మోక్షజ్ఞ పరిచయం మాత్రం కావడం లేదు.

ఆ దర్శకుల పేర్లు తెరపైకి

మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిన తర్వాత.. అతడిని ఫలానా దర్శకుడు పరిచయం చేయబోతున్నాడని తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. ముఖ్యంగా అతడిని రాజమౌళితో పాటు పూరీ జగన్నాథ్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్, క్రిష్ జాగర్లమూడి సహా ఎంతో మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తారని ప్రచారాలు జరుగుతున్నాయి.

Nandamuri Mokshagna Astrology Gone Hot Topic In Telugu Film Industry

కుర్రాడు మాత్రం లైన్‌లో
మోక్షజ్ఞ హీరోగా మారుతున్నాడని అనుకున్నా.. అతడి లుక్ మాత్రం అందుకు తగ్గట్లుగా మారలేదు. దీంతో అసలు ఈ కుర్రాడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మోక్షజ్ఞ ప్రముఖ నటనా శిక్షకుడు (యాక్టింగ్ గురువు) సత్యానంద్‌ ఇస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్‌లో చేరాడు. అలాగే, ఫైట్స్, డ్యాన్స్‌లోనూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

ఎన్నికల తర్వాత మూవీ

నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి తరచూ ఎన్నో రకాల వార్తలు టాక్స్ వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అతడి తొలి చిత్రం గురించి అసలైన షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. నందమూరి మోక్షజ్ఞ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే సినిమాల ప్రయత్నం మొదలు పెట్టబోతున్నాడని తెలిసింది.

Nandamuri Mokshagna Astrology Gone Hot Topic In Telugu Film Industry

మోక్షజ్ఞకు ఆ సమస్య
నందమూరి మోక్షజ్ఞ చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వస్తాడని అనుకుంటే.. అది అంతకంతకూ ఆలస్యం అవుతూనే ఉంటోంది. దీంతో అసలేం జరుగుతుందో అభిమానులకు అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞ జాతకంలో సమస్య ఉందని, అందుకే సినీ రంగ ప్రవేశం ఆలస్యం అవుతుందని తాజాగా ఒక వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అడ్డుకున్నది ఆయనే

బాలకృష్ణకు జాతకాలు అంటే చాలా నమ్మకం ఉందని తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నందమూరి మోక్షజ్ఞ జాతక సమస్య వల్ల అతడిని 2025 వరకూ సినిమాల్లోకి తీసుకు రావొద్దని ఓ పండితుడు ఆయనకు చెప్పారట. దీన్ని ఫాలో అవుతూనే బాలయ్య తన కొడుకు తొలి చిత్రాన్ని లేట్ చేస్తున్నారని తెలిసింది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇది హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X