హాట్ టాపిక్ :నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ నిర్మాత,టైటిల్

ఇక ఈ చిత్రానికి 'N' అనే టైటిల్ పెట్టాలని యోచిస్తున్నట్లు బాలకృష్ణకు ఇదే విషయం చెప్పినట్లు సమాచారం. బాలకృష్ణ మాత్రం టైటిల్ బాగున్నా...మరో రెండేళ్ళు అంటే చదువు పూర్తి అయ్యే దాకా తెరపైకి తెచ్చే ఆలోచన లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అంతటా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు అతని ఎంట్రీపై రోజుకో వార్త వస్తోంది. గతంలో బాలకృష్ణ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు మోక్షజ్ఞ ప్రస్తుతం బీబీఎం చదువుతున్నాడని, చదువు పూర్తయ్యాక అతడి ఆసక్తిని బట్టి భవిష్యత్తు నిర్ణయమవుతుందని బాలకృష్ణ చెప్పారు.
మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు జరిగినా బాలయ్య ప్లాన్ ప్రకారం వెళుతున్నారని అంటున్నారు. తనయుడి ఎంట్రీపై చెప్పక పోయినప్పటికీ ఓ మంచి నిర్మాత, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చేతిలో తనయుడిని పెట్టేందుకు బాలయ్య చూస్తున్నారని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ విషయంలో కూడా బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే మోక్షజ్ఞను లండన్ పంపించి అక్కడ మార్షల్ ఆర్ట్స్, డాన్స్, యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పించేందుకు బాలయ్య సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వచ్చింది. మోక్షజ్ఞ రెండేళ్ల తర్వాత వచ్చినా, 2014 లో వచ్చినా తనయుడి విషయంలో మాత్రం బాలయ్య ప్లాన్డ్‌గా వెళుతున్నారనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











