మోక్షజ్ఞ హీరోగా కాదు గెస్టే.. నందమూరి ఫ్యాన్స్‌కు ఒక గుడ్, ఒక బ్యాడ్ న్యూస్
మిగిలిన రంగాలతో పోల్చుకుంటే సినిమాల్లోనే వారసులను పరిచయం చేసేది ఎక్కువగా హైలైట్ అవుతుంటుంది. ముఖ్యంగా ఇండియాలో సినిమా స్టార్లు తమ పిల్లలను సినీ రంగానికి పరిచయం చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్‌లో సైతం చాలా మంది ఇలా వచ్చి స్టార్లుగా మారారు. ఈ క్రమంలోనే మరికొందరు అలా పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన తన కుమారుడిని పరిచయం చేయడానికి చూస్తున్నారు. తాజాగా దీనిపై ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరూ చూడండి!
బాలకృష్ణ అనౌన్స్‌మెంట్
నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞను కూడా తీసుకు రావాలని బాలయ్య కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కొన్నేళ్ల క్రితమే ఆయన స్వయంగా ప్రకటన కూడా చేశారు. దీంతో అప్పటి నుంచి నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎంతో మంది దర్శకులు
మోక్షజ్ఞ సినిమాల్లోకి పరిచయం అవుతున్నాడన్న వార్త వచ్చిన తర్వాత.. అతడిని ఫలానా దర్శకుడు పరిచయం చేస్తాడని రూమర్లు వస్తున్నాయి. ఇలా ఇప్పటికే రాజమౌళితో పాటు పూరీ జగన్నాథ్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్, క్రిష్ జాగర్లమూడి, బోయపాటి శ్రీను సహా ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, దీనిపై ప్రకటన మాత్రం రావట్లేదు.

ట్రైనింగ్‌తో లుక్స్ కూడా
వాస్తవానికి చాలా కాలం క్రితమే మోక్షజ్ఞ హీరోగా వస్తాడని అంటున్నా అతడి లుక్ మాత్రం అందుకు తగ్గట్లుగా కనిపించలేదు. దీంతో అతడు సినిమాల్లోకి రాడని టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు మోక్షజ్ఞ యాక్టింగ్ గురువు సత్యానంద్ ఇస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. అలాగే, ఫైట్స్, డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నాడు. దీనికితోడు లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు.
ఫస్ట్ మూవీ మల్టీస్టారర్‌గా
నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే అతడి తొలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. దీని ప్రకారం.. మోక్షజ్ఞ తన తండ్రి బాలయ్యతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడట. దీన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడని కూడా న్యూస్ వచ్చింది.

మోక్షజ్ఞ హీరోగా కాదు గెస్టే
నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అతడి గురించి తాజాగా ఓ ఊహించని న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవడానికి ముందే ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడట. అంటే హీరోగా రాకపోవడం బ్యాడ్ న్యూస్ అయినా సినిమాల్లోకి రావడం గుడ్ అని చెప్పొచ్చు.

బాలయ్య సినిమాతోనే
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు చేస్తున్న సినిమా కాకుండా త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' మూవీని కూడా చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారానే నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడని తాజాగా వచ్చిన న్యూస్ ద్వారా తెలిసింది. అయితే, ఇందులో అతడు గెస్ట్ రోల్‌లో మాత్రమే కనిపించబోతున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











