నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ఫస్ట్ మూవీ కోసం రంగంలోకి మోక్షజ్ఞ.. ప్రభాస్, మహేశ్, పవన్ చేసినట్లే!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఇప్పటికే ఎంతో మంది స్టార్లు తమ వారసులను హీరోలుగా పరిచయం చేశారు. ఈ క్రమంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా తన కొడుకు మోక్షజ్ఞను మూవీల్లోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి ఈ అంశం తరచూ హాట్ టాపిక్ అవుతోంది.

కానీ, మోక్షజ్ఞ మాత్రం ఇప్పటి వరకూ హీరోగా పరిచయం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ నందమూరి చిన్నోడు తన తెరంగేట్రం కోసం ఓ అడుగు ముందుకు వేసినట్లు తాజాగా తెలిసింది. ఇంతకీ మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడు? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

Nandamuri Mokshagna Joins Sathyanand Institute for Acting Course

బాలకృష్ణ ప్రకటించడంతో: ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. వారిలో పలువురు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా లాంఛ్ అవుతాడని బాలయ్య కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ కుర్రాడి రాక ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఫిజిక్ చూసి అంతా నిరాశ: నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫొటోలు కొన్నేళ్ల క్రితమే సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. బాలకృష్ణ కుటుంబం అంతా ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫొటోలవి. వీటిలో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండడంతో అవి చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు. దీని తర్వాత కూడా అతడు అదే ఫిజిక్‌తో కనిపించాడు. దీంతో అందరూ నిరాశలో మునిగారు.

Nandamuri Mokshagna Joins Sathyanand Institute for Acting Course

బాలయ్య ప్లాన్స్ మాత్రం: తన కుమారుడి సినీ రంగ ప్రవేశం గురించి నందమూరి బాలకృష్ణ ఎంతో పట్టుదలగా ఉన్నారు. అందుకే పదే పదే అతడి ఎంట్రీ గురించి కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా తెర ముందు జరిగితే.. తెర వెనుక మాత్రం మోక్షజ్ఞ లుక్‌ను మార్చేందుకు పర్సనల్ ట్రైనర్లను, నటనలో మెళకువలకు గురువులను కూడా తీసుకొచ్చారు. అంతేకాదు, మిగిలిన విభాగాల కోసం ఓ టీమ్‌ను పెట్టారు.

రాజమౌళి సహా వాళ్లంతా: మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతను బాలయ్య.. రాజమౌళి చేతిలో పెట్టాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్ సహా ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, దీనిపై క్లారిటీ మాత్రం రాలేదు. ఫలితంగా అసలు అతడు సినిమాల్లోకి వస్తాడా రాడా అని అంతా అనుకుంటున్నారు.

Nandamuri Mokshagna Joins Sathyanand Institute for Acting Course

రంగంలోకి దిగిన మోక్షజ్ఞ: నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. అతడు ప్రముఖ నటనా శిక్షకుడు (యాక్టింగ్ గురువు) సత్యానంద్‌ను ఆశ్రయించినట్లు తెలిసింది. వైజాగ్‌లో ఉండే ఆయన ఇస్టిట్యూట్‌లో మోక్షజ్ఞ యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యాడని తాజాగా న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఆ స్టార్ హీరోల మాదిరిగా: ప్రముఖ నటనా శిక్షకుడు సత్యానంద్‌కు యాక్టింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో చాలా అనుభవం ఉంది. గతంలో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ సహా ఎంతో మంది హీరోలు ఆయన దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా వాళ్ల బాటలోనే వెళ్తున్నాడు. దీంతో అతడు కూడా వాళ్లంతా గొప్ప హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X