Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ డెబ్యూ ఎప్పుడు? వారసుడి లాంచింగ్‌పై బాలయ్య మాస్టర్ ప్లాన్!

చిత్ర పరిశ్రమలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా అందరూ తమ తర్వాత తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. టాలీవుడ్‌లోని స్టార్స్ నుంచి చిన్నచితకా హీరోల వరకు వారసుల లాంచింగ్ భారీ ఎత్తున జరుగుతోంది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా కొనసాగుతున్న బాలయ్య తన నట వారసుడి ఎంట్రీని మాత్రం పట్టాలెక్కించలేకపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి రావడంతో నందమూరి మోక్షజ్ఞ తేజ డెబ్యూ జరగడం లేదు. అభిమానులు మాత్రం బాలయ్య మీద ఈ విషయంలో ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు.

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ప్రశాంత్ చెప్పిన పాయింట్ నచ్చడంతో బాలయ్య ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతున్నట్లుగా వెల్లడించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని కూడా వార్తలు వచ్చాయి. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని ఫిలింనగర్‌లో గాసిప్స్ వినిపించాయి.

Nandamuri Mokshagna Teja Debut Update Balakrishna Plans Big Launch with Aditya 999 Max

రెండేళ్ల క్రితం మోక్షజ్ఞ బర్త్ డేను పురస్కరించుకుని సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ లుక్‌ను విడుదల చేశారు. క్యూట్ లుక్‌లో అందిరనీ మెస్మరైజ్ చేశారు బాలయ్య కుమారుడు. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ లుక్ చేసి తెగ సంబరాలు జరుపుకున్నారు. స్క్రిప్ట్, నటీనటులు, టెక్నీషియన్స్ అంతా సెట్ అయ్యాక.. రేపో మాపో లాంచింగ్ అనుకుంటుండగా అనూహ్యంగా సినిమా ఓపెనింగ్ వాయిదా పడింది. దీనికి కారణాలపై రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే మోక్షజ్ఞ ఆరోగ్యం బాలేని కారణంగానే సినిమా లాంచింగ్‌ను వాయిదా వేసినట్లుగా బాలకృష్ణ వెల్లడించారు.

అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం నందమూరి అభిమానుల నుంచి బాలయ్యపై ఒత్తిడి పెరుగుతోందట. అందుకే ఈ విషయంలో బాలయ్య ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ కాకుండా మరో దర్శకుడితో మోక్షజ్ఞను లాంచ్ చేయాలని ఆయన భావిస్తున్నారట. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో క్లాసిక్ చిత్రాలలో ఒకటైన ఆదిత్య 369కి సీక్వెల్‌గా ఆదిత్య 999 మ్యాక్స్‌తోనే మోక్షజ్ఞ లాంచింగ్ దాదాపు ఖరారైనట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

బాలకృష్ణలో గౌతమీపుత్ర శాతకర్ణిని తెరకెక్కించిన విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని.. బాలయ్య దగ్గరుండి అన్ని విషయాలు పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ ఏడాది మోక్షజ్ఞ లాంచింగ్ ఉండాలని బాలయ్య భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ వేసవిలోనే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ సెట్స్ మీదకి వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముంది? నిజంగానే మోక్షజ్ఞ ఎంట్రీ క్రిష్ చేతుల మీదుగా జరుగుతుందా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X