Balakrishna Mokshagna: ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్... బాలయ్య సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ!

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఆయన సినిమా ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ... ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ ఆయన మొదటి సినిమా ఎంట్రీ అయితే కన్ఫామ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ మొట్టమొదటిసారిగా లెజెండ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా సెట్స్ కి వెళ్ళాడు. అక్కడ ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో కుర్రాడు భలే ఉన్నాడు హీరోగా అయితే భలే ఉంటాడని అప్పటి నుంచే చర్చ మొదలైంది. అయితే అప్పట్లో వయసు తక్కువ కాబట్టి ఇప్పట్లో ఎంట్రీ ఉండకపోవచ్చని అనుకున్నారు.

 Nandamuri Mokshagna Teja Guest Role in Balayya Anil Ravipudi Bhagavanth Kesari Movie News Goes Viral

కానీ కాలం గడుస్తున్న కొద్ది ఎప్పుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటే... ఇతర హీరోల అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తాడని చూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ తేజ ఎంట్రీ గురించి నందమూరి బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారని వార్త గత రెండు మూడు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉంది.

 Nandamuri Mokshagna Teja Guest Role in Balayya Anil Ravipudi Bhagavanth Kesari Movie News Goes Viral

నందమూరి బాలకృష్ణ సైతం మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఫిక్స్ అయిందని పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే హీరోగా ఆయన ఎంట్రీ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కానీ అంతకంటే ముందే ఆయన ఒక సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ సినిమా మరేమిటో కాదు భగవంత్ కేసరి అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో మోక్షజ్ఞ కనిపిస్తాడనే ప్రచారం ఇప్పుడు గట్టిగా జరుగుతోంది.

 Nandamuri Mokshagna Teja Guest Role in Balayya Anil Ravipudi Bhagavanth Kesari Movie News Goes Viral

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మునుపేన్నడు కనిపించని ఒక పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. అంతేకాక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ కుమార్తె వరుసయ్యిే యువతి పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. శ్రీలీలను వివాహం చేసుకోబోయే వ్యక్తి పాత్రలోనే ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ తేజ కనిపించబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 Nandamuri Mokshagna Teja Guest Role in Balayya Anil Ravipudi Bhagavanth Kesari Movie News Goes Viral

అలా జరగడానికి కూడా కారణం లేకపోలేదు. ఈ మధ్యనే నందమూరి మోక్షజ్ఞ తేజ బాలకృష్ణ సినిమా షూటింగ్ సెట్స్ లో కనిపించాడు. ఆ ఫోటోలు వైరల్ గా కూడా మారాయి. ఇక అప్పటినుంచి నందమూరి మోక్షజ్ఞ తేజ ఈ భగవంత్ కేసరి సినిమాలో నటించాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. సినిమాలో శ్రీలీలను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిగా అతిథి పాత్రలో ఆయన కనిపించబోతున్నాడని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 Nandamuri Mokshagna Teja Guest Role in Balayya Anil Ravipudi Bhagavanth Kesari Movie News Goes Viral

నందమూరి అభిమానులు కూడా ఇదే భావిస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా రిలీజ్ అయితే తప్ప ఈ విషయం మీద ఒక అవగాహన వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఒకవేళ నిజంగానే అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ.. మోక్షజ్ఞ నటిస్ేత.. ఇక బాలయ్యా ఫ్యాన్స్ కు అది పండగే అని చెప్పాలి. చూడాలి మరి ఏమవుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X