‘సోలో’తో బయటపడ్డ నందమూరి-నారా వారి గొడవలు..!?
నారా రోహిత్ రాబోయే చిత్రం 'సోలో" ఆడియో విడుదల హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన విషయం తెలిసిందే ఉల్లాస భరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, శర్వానంద్, అల్లరి నరేష్, నారా రోహిత్, నిషా అగర్వాల్, పరశురాం, వంశీ కృష్ణ శ్రీనివాస్, వంశీ పైడిపల్లి, రామ్ జోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య తదితరులు ఉన్నారు. నారా రోహిత్ చిన్నాన్న మరియూ టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఆడియో సిడి ని ఆవిష్కరించారు. అల్లరి నరేష్, శర్వానంద్ ఈ మూవీ ట్రైలర్స్ ను విడుదల చేసారు.
ఎంతకాదన్నా, లేదన్నా... ఔనన్నా...కాదన్నా.. నారా-నందమూరి ఫ్యామిలీ మధ్య ఏదో ఓ రూపంలో గొడవలున్నాయనే విషయం బయటపడుతూనే ఉంది. ఇరు కుటుంబాలు మా మధ్య ఎలాంటి గొడవలు లేవని బహిరంగంగా చెబుతున్నా... లోలోపల ఏదో జరుగుతుందనే అనుమానాలొస్తున్నాయి. నారా చంద్రబాబునాయుడు తమ్ముడి కొడుకు నారా రోహిత్ హీరోగా నటిస్తోన్న సోలో చిత్ర ఆడియో ఫంక్షన్ శిల్పారామంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో నందమూరి హీరోలు ఒక్కరూ కనిపించలేదు. దీంతో.. నారా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీ దూరంగా ఉన్నట్టు మరోసారి స్పష్టమైంది. ఈ ఫంక్షన్ కు నారాచంద్రబాబునాయుడే చీఫ్ గెస్ట్. నందమూరి హీరోల సపోర్ట్ లేకుండానే నారా రోహిత్ సోలోగానే స్టార్ హీరోగా ఎదిగేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. హీరోలే సపోర్ట్ చేయనప్పుడు నందమూరి ఫ్యాన్స్ రోహిత్ ను ఎలా సపోర్ట్ చేస్తారో చూడాలి. టీడీపీ క్యాడరే సెపరేట్ గా నారా రోహిత్ కోసం ఫ్యాన్స్ క్లబ్ లను ఏర్పాటు చేస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











