»   » నందమూరి వార్...నాగ్ నలిగిపోతున్నారా?

నందమూరి వార్...నాగ్ నలిగిపోతున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి హీరోలిద్దరి సినిమాలు సంక్రాంతికి విడుదల కానుండటంతో ధియోటర్స్ వద్ద పెద్ద యుద్దమే జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఎవరికి వారే ఎక్కువ థియోటర్స్ తమ సినిమాకోసే ఆక్యుపై చేయాలని ప్రయత్నాలు చేస్తూండటంతో మధ్యలో ఇదే సీజన్ లో విడుదల అవుతున్న నాగార్జున చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా నలిగిపోతోందంటున్నారు.

అప్పటికీ నాగార్జున వేరే వారికి డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇస్తే...ధియోటర్స్ సమస్య ఖచ్చితంగా వస్తుందని, తనే స్వయంగా కీలకమైన ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారు. తన మొహమాటంతో అయినా ధియోటర్స్ సమస్య రాదని భావించారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా నందమూరి హీరోల సినిమాల మధ్య ధియోటర్ వార్ మొదలవ్వటంతో నాగార్జున ఏం చేయలేని డైలమోలో పడ్డారంటున్నారు.


మీడియాలో వినపడుతున్నదాని ప్రకారం... విజయవాడకు చెందిన కాకుమాను ప్రసాద్ (అలంకార్ ప్రసాద్) జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా 'నాన్నకు ప్రేమతో' కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. గన్నవరానికి చెందిన తుమ్మల రామ్మోహన్‌రావు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డిక్టేటర్' సినిమా డిస్ట్రిబ్యూషన్‌ను తీసుకోగా, నాగార్జున ఫ్యాన్స్ ఆలిండియా అధ్యక్షుడు సర్వేశ్వరరావు నాగార్జున హీరోగా నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నారు.


Nandamuri Theatre war..effect on Nag

అందుకుతగినట్లుగానే... ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయినా చిత్రాల సినిమాలకు నెల క్రితమే జిల్లాలో థియేటర్ల బుకింగ్ పూర్తయింది. దీంతో ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా విడుదలకానున్న బాలయ్య 'డిక్టేటర్'కు జిల్లాలో ధియేటర్స్ దొరకలేదు. అయితే డిక్టటర్ కు సంభందించిన వారు మ్యానేజ్ చేసి దాదాపు 30 ధియోటర్స్ వరకూ సంపాదించారు. ముఖ్యంగా సింగిల్ ధియోటర్స్ ఉన్న చోట్ల డిక్ట్టేటర్ ని వేసే ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ నేపధ్యంలో నాన్నకు ప్రేమతో ధియోటర్స్ పై ఆ ఎఫెక్ట్ పడకుండా ఎన్టీఆర్ అభిమానులు అడ్డుపడుతున్నారు. దాంతో మధ్యలో నాగార్జున సినిమాకు దెబ్బ పడుతున్నట్లు సమాచారం. సోగ్గాడే కోసం పెట్టుకున్న ధియోటర్స్ ఎక్కువ డిక్టేటర్ కు వెళ్లిపోతున్నాయంటున్నారు. ముఖ్యంగా డబుల్ థియేటర్లు ఉన్నచోట నాగార్జున సినిమాను ప్రక్కన పెడుతున్నట్లు సమాచారం ఇలా ఈ వార్ లో నాగార్జున సినిమాకు ఎఫెక్టు పడుతోంది. దీంతో నాగార్జున ఫ్యాన్స్ మండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
Tollywood right now with the news making rounds that a big clash has erupted between Nandamuri Hero's and Akkineni Nagarjuna for shankranthi release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu