నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం పూర్తి డిటేల్స్
నందమూరి బాలకృష్ణ త్వరలో వందవ చిత్రం చేయనున్నారు.తన కెరీర్ లో ది బెస్ట్ గా ఆ చిత్రం నిలబడాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారు.వందవ చిత్రంగా నందీశ్వరుడు కధను తెరకెక్కించనున్నాడని సమాచారం.చిన్ని కృష్ణ రచించిన ఆ కథతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెంగల వెంకట్రావు నిర్మాతగా ఆ చిత్రం రూపొందించాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తనకు సెంటిమెంట్ గాకలిసివచ్చి హిట్ ఇచ్చిన కాంబినేషన్ తోనే బాలయ్య ఈ మెగా ప్రాజెక్టుని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతో్ంది.
తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన నరసింహనాయుడు కథా రచయిత చిన్ని కృష్ణ కథని, సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత చెంగల వెంకట్రావుని, తన కెరీర్ పతన స్ధితిలో ఉన్నప్పుడు సూపర్ హిట్టిచ్చిన దర్శకుడు బోయపాట శ్రీను ని ఆయన నమ్ముకుని ఈ వందవ చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ..బాపు దర్శకత్వంలో శ్రీరామ రాజ్యం, పరుచూరి మురళి దర్శకత్వంలో మహదేవ నాయుడు, బి గోపాల్ దర్శకత్వంలో హర హర మహాదేవ చిత్రాలకు పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











