'అలా మొదలైంది' నందినీ రెడ్డికి బెల్లంకొండ భారీ ఆఫర్
"అలా మొదలైంది" చిత్రంతో పరిచయమైన దర్శకురాలు నందినీరెడ్డికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. క్రేజ్ ఎక్కడున్నా వెంటనే తన బ్యానర్ లో సినిమా ప్రారంభించే బెల్లంకొండ సురేష్ ఆమెను తన తదుపరి చిత్రానికి ఒప్పించాడు. ఈ మేరకు యాక్షై లక్షల రూపాయలు వరకూ రెమ్యునేషన్ ఇవ్వటానికి ముందుకు వచ్చాడని, పది లక్షలు అడ్వాన్స్ గా ఇప్పటికే ముట్టచెప్పాడని సమాచారం. అయితే కథ, హీరోలు ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. తన దగ్గరున్న బాడీగార్డ్ రీమేక్ చేయమంటున్నా ఆమె మాత్రం సొంత కథతోనే తన తదుపరి చిత్రం చేయాలనుకుంటున్నట్లు, అలాగే అల్లు అర్జున్, నాగచైతన్య వంటి యంగ్ హీరోలతో చేయాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్తన్నారు. ఇక బెల్లంకొండ రీసెంట్ గా నాగవల్లి చిత్రం రీమేక్ ని వెంకటేష్ తో తీసి డిజాస్టర్ సాధించారు.
బెల్లంకొండ సురేష్ నాని నిత్యా మీనన్ ఎల్ దామోదర్ రెడ్డి నందినిరెడ్డి bellamkonda suresh nani nithya menon nandini reddy kalyan malik


Click it and Unblock the Notifications