Nani: రజనీకాంత్ అమితాబ్ బచ్చన్‌తో నాని సినిమా.. 'జై భీమ్' దర్శకుడితో ఊహించని విధంగా!

ప్రస్తుతం పాన్ ఇండియా, మల్టీ స్టారర్ సినిమాల హవా తెగ నడుస్తోంది. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర నటీనటులు ఒకే సినిమాలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అలాంటి మైండ్ బ్లోయింగ్ మల్టీ స్టారర్ చిత్రం ఒకటి త్వరలో రానుంది. ఇందులో తలైవా, సూపర్ స్టార్ రజనీ కాంత్ తో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తోపాటు నేచురల్ స్టార్ నాని నటించనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు ఆసక్తిగా మారాయి.

హాయ్ నాన్నతో: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన తనదైన గుర్తింపు సాధించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. అష్టా చమ్మా మూవీతో మొదలైన నాని ప్రయాణం ఈగ, నిన్ను కోరి, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు నటుడిగా నిలబెట్టాయి. ఇక నాని కెరీర్ బెస్ట్ పెర్ఫానెన్స్ మూవీగా ప్రశంసలు అందుకుంది. నాని ప్రస్తుతం హాయ్ నాన్నతోపాటు మరో కొత్త సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Nani Amitabh Bachchan In Superstar Rajinikanth 170 Movie With TJ Gnanavel Raja

అగ్ర నటీనటులు: ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. రజనీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం జైలర్. మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ అతిథిపాత్రల్లో మెరవనున్నట్లు టాక్.

Nani Amitabh Bachchan In Superstar Rajinikanth 170 Movie With TJ Gnanavel Raja

సెట్స్ పైకి: జైలర్ సినిమాలో రమ్యకృష్ణ కూడా మరో కీలక పాత్ర పోషించనుంది. అయితే రజనీ కాంత్ జైలర్ సినిమానే కాకుండా 170వ చిత్రం కూడా చేస్తున్నారు. సూర్యతో జై భీమ్ వంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ 170వ మూవీ కార్యరూపం దాల్చనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కనుందని టాక్.

TJ Gnanavel Raja

కోలీవుడ్ సెన్సేషన్: తలైవా 170వ మూవీలో రజనీ కాంత్ పాటు బాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించనున్నారట. వీళ్లే కాకుండా ప్రముఖ మలయాళ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ సైతం కీలక పాత్రలు పోషించున్నారని సమాచారం. ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నాడు.

Nani Amitabh Bachchan In Superstar Rajinikanth 170 Movie With TJ Gnanavel Raja

చాలా ఎఫెక్టివ్ రోల్: రజనీకాంత్ 170వ సినిమాలో నాని ఊహించని పాత్ర చేస్తున్నట్లు వినికిడి. ఇందులో నాని రోల్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని భోగట్టా. మరి తాను మెచ్చే రజనీకాంత్ తో నాని ఎలా నటిస్తాడు, ఎంతవరకు ప్రభావం చూపుతాడనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాబట్టి, దీంట్లో ఎంతవరకు నిజముందనేది తెలియరాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X