For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Project K: ప్రభాస్ సినిమాలో నాని, విజయ్ దేవరకొండ..బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యే రోల్స్.. నిజమేనా?

  |

  బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాల స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. ప్రతి ఏడాది కూడా వాటి స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కేవలం బడ్జెట్ లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాలకు గౌరవం దక్కుతోంది. ముఖ్యంగా ప్రభాస్ చేస్తున్న సినిమాలు వివిధ దేశాల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

  అసలు బాహుబలి అనంతరం ప్రభాస్ చాలా నెమ్మదిగా కొన్ని మినీ బడ్జెట్లో సినిమాలు సైతం చేయాలనుకున్నాడు. కానీ వచ్చిన పాన్ ఇండియా మార్కెట్ ను ఏ మాత్రం వదులుకోకూడదు అని డిసైడ్ అయ్యారు. ఒక విధంగా అలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి కూడా చాలా మంచిదని ప్రభాస్ పెద్ద సినిమాలను చేస్తున్నాడు.

  నాని, విజయ్ దేవరకొండ..

  నాని, విజయ్ దేవరకొండ..

  ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ K పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మరికొంత మంది హీరోలు ముఖ్యమైన పాత్రల్లో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాని, విజయ్ దేవరకొండ పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  మరో రెండు ముఖ్యమైన పాత్రల కోసం

  మరో రెండు ముఖ్యమైన పాత్రల కోసం

  అయితే రూమర్స్ రావడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు మరో రెండు ముఖ్యమైన పాత్రల కోసం ఎవరైనా యువ హీరోల నటిస్తే బాగుంటుందని నాగ్ అశ్విన్ కథ రాసుకునే సమయంలోనే ఆలోచించాడు. ఇక పాత్రలకు సంబంధించిన వార్తలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ ఇదివరకే నాని, విజయ్ దేవరకొండ తో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ మొదట్లో సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవడే సుబ్రహ్మణ్యం ద్వారా మంచి అవకాశం దక్కింది. అందులో నాని హీరోగా నటించగా విజయ్ ఒక స్నేహితుడు పాత్రలో నటించాడు.

  ఎప్పుడు పిలిచినా కూడా..

  ఎప్పుడు పిలిచినా కూడా..

  ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా హిట్ అవ్వడంతో అందరికీ మంచి క్రేజ్ దక్కింది. సినిమా అనంతరం నాగ్ అశ్విన్ మహానటి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ఒక పాత్రలో నటించి దర్శకుడికి హెల్ప్ అయ్యాడు. అలాగే జాతిరత్నాలు సినిమాలో కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించి సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాడు. నాగ్ అశ్విన్ ఎప్పుడు పిలిచినా కూడా.. ఎలాంటి పాత్రల్లో నటించడానికి అయినా విజయ్ దేవరకొండ సిద్ధంగా ఉంటాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ లాంటి అగ్రహీరోతో సినిమా కోసం అంటే విజయ్ మరింత ఇంట్రెస్ట్ చూపిస్తాడని చెప్పవచ్చు.

  వైజయంతి సంస్థతో నాని అనుబంధం

  వైజయంతి సంస్థతో నాని అనుబంధం

  వైజయంతి సంస్థతో నానికి కూడా మంచి అనుబంధం ఉంది. ఆ బ్యానర్ లో నాగార్జునతో కలిసి దేవ దాస్ అనే సినిమా కూడా చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ K లో కూడా ఒక గెస్ట్ రోల్ లో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ K సినిమా సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. చిత్ర యూనిట్ కూడా అదే తరహాలో ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఆదిత్య 369లో బాలకృష్ణ గతానికి వెళ్లి ఎలాగైతే కృష్ణదేవరాయ పాత్రలో కనిపించారో అలాగే నాని విజయ్ దేవరకొండ కూడా ఒకరు హిస్టారికల్ పాత్రలో మరొకరు భవిష్యతు పాత్రలో మెప్పించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

  కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలోనే

  కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలోనే

  ఈ సినిమాలో అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మొదట గెస్ట్ రోల్ అని టాక్ వచ్చింది కానీ. అందులో ఎలాంటి నిజం లేదని దర్శకుడు ఇదివరకే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు. సినిమా మొత్తంలో ప్రభాస్ తో పాటు ఆయన కూడా ఉంటారని చెప్పారు. హీరోయిన్బుగా దీపికా పదుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె కూడా కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలోనే కనిపించనుందట. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఇటీవల హైదరాబాద్ లో మొదలుపెట్టిన చిత్రం యూనిక్ రెండేళ్ల టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు.

  ఇక సినిమా షూటింగ్ పనులను 2023 లో పూర్తి చేసి 2024 సమ్మర్ లో విడుదల చేయాలని ఒక షెడ్యూల్ అయితే సెట్ చేసుకున్నారట. 50 ఏళ్ల వైజయంతి మూవీస్ సినీ ప్రస్థానంలో అత్యదిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ఇదే. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  Megaatar Chiranjeevi Daughter To Debut In Tamil Remake | సక్సెస్ అవుతుందా?
  ప్రభాస్.. రాబోయే సినిమాలు

  ప్రభాస్.. రాబోయే సినిమాలు

  ఇక సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరోవైపు ప్రభాస్ ఈ సినిమా కోసం సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజేశ్యామ్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇక మరో వైపు సలార్ సినిమాతో పాటు ఆదిపురుష్ కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఆ రెండు సినిమాల షూటింగ్ పనులను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేసుకోవాలని ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

  ఇక ప్రాజెక్ట్ కోసం రెబల్ స్టార్ కరెక్ట్ గా 200 రోజుల డేట్స్ కేటాయించినట్లు సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చే ఏడాది మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకురావచ్చని తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో పాటు మరొక టాలీవుడ్ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

  English summary
  Nani and vijay devarakonda special roles in prabhas project k movie. It seems that there is a chance that some more heroes will play important roles in this movie which is being screened by Vyjayanti Movies with great ambition. The names Nani and Vijay Devarakonda are also going viral on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X