సుకుమార్ శిష్యుడిని లైన్ లో పెట్టిన నాని?
నేచురల్ స్టార్ నాని కూడా స్టార్ హీరోల కంటే స్పీడ్ గా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలని కాకుండా కామెడీ, పిరియాడిక్, ఫ్యామిలీ జానర్స్ అంటూ డిఫరెంట్ గా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం టక్ జగదీష్ విడుదలకు రెడీగా ఉన్న విషయం తెలిసిందే. శివ నిర్వణ డైరెక్ట్ చేసిన ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక ట్యాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తో కూడా శ్యామ్ సింగరాయ్ అనే బిగ్ బడ్జెట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాపై కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక శ్యామ్ సింగరాయ్ అనంతరం వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి అనే సినిమాను ఫినిష్ చేయనున్నాడు.

వరుసగా ఇలా మూడు విభిన్నమైన సినిమాలను లైన్ లో పెట్టిన నాని సుకుమార్ శిష్యుడితో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అనే యువ దర్శకుడు సుకుమార్ దగ్గర గత కొన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నాడు. ఇక ఇటీవల సుకుమార్ సలహా మేరకు ఆయన శిష్యుడి కథ విన్న నాని వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. అయితే బిజీగా ఉండడం వలన ఆ సినిమాను ఇప్పట్లో స్టార్ట్ చేసే అవకాశం లేదట. అందుకే దర్శకుడిని కొన్ని నెలలు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











