Ravanasura: రావణాసుర ఈవెంట్‌కు ఆ స్టార్ హీరో.. ఆ సెంటిమెంట్‌తో మరో హిట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్వయంకృష్టితోనే ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారి.. తనలోని టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు మాస్ మహారాజా రవితేజ. టాలీవుడ్‌లో ఎవరూ చేయని విధంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఆయన.. గత ఏడాది చివర్లో 'ధమాకా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో రవితేజ వంద కోట్ల క్లబ్‌లోకి చేరుకున్నాడు. అలాగే, ఈ సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీలో చిరంజీవితో కలిసి రవితేజ సందడి చేశాడు. ఇది ఏకంగా రూ. 200 కోట్లు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఈ మధ్య కాంలో వరుస హిట్లుతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు 'రావణాసుర' అనే చిత్రంలో నటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 2022 సంక్రాంతి పండుగకు మొదలెట్టారు. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. అయితే, మధ్యలో కొన్ని బ్రేకులు రావడంతో ఇటీవలే టాకీ పార్టును పూర్తి చేసి.. ఇప్పుడు విడుదలకు రెడీ చేసేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి మరో ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది.

Nani Chief Guest for Ravi Teja Starrer RAVANASURA Movie Pre Release Event

మాస్ హీరో రవితేజ నటించిన 'రావణాసుర' మూవీని ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ ప్రకటన కూడా వెలువడింది. ఇక, దీనికి నేచురల్ స్టార్ నాని గెస్టుగా వస్తున్నాడని ఓ న్యూస్ లీకైంది. 'దసరా' ప్రమోషన్స్‌లో రవితేజ భాగం అయినట్లే.. ఇప్పుడు 'రావణాసుర' కోసం అతడు వస్తున్నాడట. ఇదే నిజమైతే ఈ మూవీ కూడా హిట్ అయినట్లే అని ఫ్యాన్స్ చెప్పుకుంటోన్నారు.

ఇదిలా ఉండగా.. 'రావణాసుర' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతాన్ని అందించారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా హీరోయిన్లుగా నటించగా.. సుశాంత్ కీలక పాత్రను చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X