సెగతో దెబ్బకి కిందపడ్డ నాని ఈగతో మళ్ళీ పైకెళతాడా..!?
అలా మొదలైంది అంత హిట్టయ్యేసరికి హీరో నానికి కళ్లు నెత్తికెక్కాయని ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. తనకి కథ చెప్పడానికి వెళ్లిన యువ దర్శకులతో దురుసుగా ప్రవర్తించేవాడని, వారు చెబుతున్న కథల్ని భూతద్దంలో వెతికి లోపాలు ఎత్తి చూపించి పంపేవాడని అన్నారు. అంతే కాక పారితోషికం పెంచాలని, తన సినిమా పదికోట్ల విలువ చేస్తుంది కనుక తనకి కనీసం రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని గుసగుసలాడుకున్నారు. అయితే నాని ఆటలు ఎంతో కాలం సాగలేదు.
తదుపరి సినిమాతోనే అతినికి చావు దెబ్బ తగిలింది. అనువాద చిత్రమే అయినా కానీ నాని, నిత్య పేరు మీద బాగానే బిజినెస్ చేసిన సెగ చాలా త్వరగా చల్లారిపోయింది. హిట్టొస్తే పది కోట్లొస్తాయి సరే..ప్లాపయితే కనీసం అందులో సగమైనా తేగలవా? అంటూ నానిని డైరెక్టుగా ప్రశ్నిస్తున్నారు. సెగ సినిమాతో అటు తమిళంలో కూడా తనకి మార్కెట్ ఏర్పడి తన రేంజ్ పెరుగుతుందని ఆశించిన నాని ఈ ఎదురు దెబ్బతో తన రేంజ్ ఏమిటో తెలుసుకుని జాగ్రత్తగా మసలుకుంటున్నాడు. కొద్ది రోజుల వరకు చేసిన హడావిడి తగ్గించి నేల మీద కొచ్చేశాడు. ఈగ హిట్టయితే మళ్ళీ చెట్టుక్కుతాడేమోనని అంటున్నవారు కూడా లేకపోలేదు.


Click it and Unblock the Notifications











