Nani30: వెంకటేష్ 'సైంధవ్'లో నాని.. కన్ఫర్మ్ చేసిన హీరో.. హిట్ యూనివర్స్‌లో భాగం?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది హీరోగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టగా.. అంటే సుందరానికి చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇక హిట్ 2 సినిమాతో నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా ఈ ఏడాది దసరా మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. త్వరలో Nani30 సినిమాను లైన్ లో పెట్టనున్నాడు. అయితే ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న సైంధవ్ మూవీలో నాని నటిస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సెలబ్రిటీల ప్రశంసలు:నేచురల్ స్టార్ నాని తాజాగా దసరా సినిమతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల తెరకెక్కించిన దసరా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని ప్రశంసలు అందుకున్నాడు. నానితోపాటు మిగతా నటీనటులు, చిత్రబృందానికి టాలీవుడ్ సినీ సెలబ్రిటీల నుంచి పొగడ్తల వర్షం కురుస్తోంది.

Nani Confirms His Cameo Role In Venkatesh Saindhav And NANI30 Release Date

మరోసారి కొత్త దర్శకుడు:ప్రస్తతం దసరా ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాని మరోవైపు Nani30 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. న్యూ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేసే నాని మరోసారి కొత్త దర్శకుడితో ఈ సినిమా చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ గా రానున్న శౌర్యవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైరా ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సీతా రామం బ్యూటీతో:Nani30 సినిమాలో నానికి జంటగా సీతా రామం బ్యూటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించనుంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్లుగా నాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే ఈ క్రమంలోనే మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు నాని.

Nani Confirms His Cameo Role In Venkatesh Saindhav And NANI30 Release Date

కెమియో రోల్:విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ సైంధవ్ (Saindhav). ఇందులో నాని కెమియో రోల్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించాడు. అయితే సైంధవ్ మూవీకి హిట్ ఫ్రాంఛైజీ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందిన విశ్వక్ సేన్ మెయిన్ లీడ్ రోల్ చేసిన 'హిట్: ది ఫస్ట్ కేస్' మూవీతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నాడు హీరో నాని.

హిట్ ఫ్రాంఛైజీనా?:హిట్ మూవీ తర్వాత గతేడాది విశ్వక్ సేన్ హీరోగా 'హిట్: ది సెకండ్ కేస్' సినిమా ఎండింగ్ లో నాని బ్రూటల్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా కనిపించి హిట్ 3కి హింట్ ఇచ్చాడు. ఇప్పుడు సైంధవ్ లో గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా నాని కన్ఫర్మ్ చేశాడు. అయితే హిట్ ఫ్రాంఛైజీ డైరెక్టర్ శైలేష్ కొలను సైంధవ్ కు దర్శకత్వం వహించడం, నిర్మాత నాని గెస్ట్ రోల్ చేయడం చూస్తుంటే సైంధవ్ కూడా ఆ ఫ్రాంఛైజీలోనే భాగమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వీటిపై ఎలాంటి క్లారిటీ లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X