Dasara: సుకుమార్ డిజాస్టర్ సినిమాతో పోలికలు.. కథలో అదే అసలు పాయింట్?
నాని హీరోగా తెరకెక్కిన బిగ్ బడ్జెట్ మూవీ దసరా సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేస్తున్నారు. ఇక సుకుమార్ దగ్గర ఎంతో కాలంగా వర్క్ చేసినా శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
అతనికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ కూడా దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు అంటే మామూలు విషయం కాదు. ఇక ట్రైలర్ విజువల్స్ చూసిన తరువాత ఎంతో అనుభవం ఉన్న దర్శకుడి తరహాలో డిజైన్ చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. శ్రీకాంత్ అయితే ప్రేక్షకులను గట్టిగానే అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సంబంధించిన అనేక రకాల విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా దసరా సినిమాలోని ఒక పాయింట్ సుకుమార్ డిజాస్టర్ సినిమాకు దగ్గరగా పోలి ఉంటుందట. ముఖ్యంగా ఆర్య 2 సినిమాలోని ఒక పాయింట్ ను శ్రీకాంత్ ఇందులో వాడుకున్నాడని టాక్. ఈ సినిమాలో నాని కీర్తి సురేష్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి పాత్ర కూడా ఇందులో చాలా కీలకం కానుంది. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఆర్య 2 కి సంబంధించిన ఛాయలు ఇందులో కాస్త హైలెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.
ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ దర్శకుడు శ్రీకాంత్ తన గురువు దగ్గర నేర్చుకున్న పాఠాలను ఇందులో కూడా చాలా చక్కగా పొందుపరిచినట్లుగా అనిపిస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సముద్రఖని ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.


Click it and Unblock the Notifications











