ప్రభాస్ కారణంగా వెనక్కి తగ్గిన నాని!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్ చిత్రం 'సాహో'. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. 'సాహో'ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవకపోవడం వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు.

ఈ మధ్య 'సాహో' కొత్త రిలీజ్‌ డేట్‌ను ఆగస్టు 30కి వాయిదా వేశారు. అలాగే, మంగళవారం సినిమా రిలీజ్ డేట్ పోస్టర్లను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే, 'సాహో' టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ట నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'గ్యాంగ్ లీడర్' టీమ్ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. దీనికి కారణం ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటున్న తేదీనే 'సాహో' విడుదలకు ముహూర్తం పెట్టడమే. దీంతో నాని సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Nani disappointed With Prabhas

'గ్యాంగ్ లీడర్'ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే 'ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు.

సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి, సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టింది ఈ చిత్ర యూనిట్. అలాగే, ఈ మధ్య ప్రీ లుక్, ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్, టీజర్ రిలీజ్‌ డేట్లను కూడా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఒక్కోటి విడుదల చేసుకుంటూ వస్తోంది. ఇంతలో ప్రభాస్ షాక్ ఇవ్వడంతో 'గ్యాంగ్ లీడర్' వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X