నానికి షాక్ ఇచ్చిన రాజమౌళి!?
రాజమౌళి చిత్రంలో ఆఫర్ రాగానే నాని చాలా సంతోషించాడు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈగ చిత్రంలో తనను హీరోగా ఎంపిక చేసుకోవటం, తన ప్రక్కన సమంతని హీరోయిన్ గా తీసుకోవటంతో తను పెద్ద హీరోల లిస్ట్ లో చేరిపోయానని నాని సంబరపడిపోయాడు. దాంతో బయిట దర్శకులకు, నిర్మాతలకు వంద కండీషన్స్ పెట్టే నాని ఈ చిత్రం కథ కూడా వినకుండా ఓకే చేసేసాడు. అంతేగాక రెమ్యునేషన్ కూడా చాలా నామినల్ గా తీసుకుంటున్నాడు. అయితే నాని సంబరాన్ని ఎక్కవ కాలం రాజమౌళి ఉంచలేదని అతన్ని నిరాశపరిచాడని అంటున్నారు. ఎందుకంటే నాని పాత్ర చిత్రం కేవలం ఇరవై నిముషాలే ఉంటుందని చెప్తున్నారు. దానికి తోడు నాని తనను హైలెట్ చేస్తూ పోస్టర్స్, పబ్లిసిటీ రాజమౌళి చేస్తాడని అనుకున్నాడట.
అయితే అందుకు విరుద్దంగా ఈగను హైలెట్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రాజమౌళి వదిలి షాక్ ఇచ్చాడు. అంతేగాకుండా ప్రమోషన్ లో కూడా సమంతకు ఇచ్చిన ప్రయారిటినీ నానికి అస్సలు ఇవ్వటం లేదని తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్న ఈగను చూడాలంటే ఏప్రిల్ 5వ తేదీ వరకూ ఆగాల్సిందే. నాని, సమంత, కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్న ఈ సినిమా ఇతివృత్తం ఒక 'ఈగ పగ'. అంటే, సాటి ఈగలపైన కాదట, మనుషులే దాని శత్రువులంటున్నారు. చిత్రం షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తికాగా కథాంశానికి అత్యంత కీలకమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు నడుస్తున్నాయి. 'ఈగ' స్టిల్స్ కొన్ని ఈ మధ్యనే విడుదల కాగా ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఎం ఎం కీరవాణి బాణీలు సమకూర్చిన ఈ సౌండ్ ట్రాక్‌ని మార్చి 22న మార్కెట్‌లోకి విడుదల చేస్తారని తెలిసింది.


Click it and Unblock the Notifications











