Hi Nanna: ఏంది నాని ఇది నిజమేనా... హాయ్ నాన్న మూవీ రీమేకా..?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్ని. ఇక ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించాడు. అందులోనూ నాని కెరియర్ లో ఈ సినిమా 30వది. ఇక పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా రీమేక్ అని అంటున్నారు. అది కూడా ఓ తెలుగు సినిమాకు రీమేక్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే....
దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నాని... ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమా తన 30వ చిత్రం. ఇక కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శృతిహాసన్ ఓ ముఖ్య పాత్రలో నటింస్తోందని ఇన్ సైడ్ టాక్. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా... తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే అర్థం అయింది.

ఇటీవల హాయ్ నాన్న టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ లో నాని, మృణాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండటంతో సెంటిమెంట్ తో పాటు రొమాన్స్ కూడా బాగానే ఉన్నట్టు అర్థం అయిపోయింది. అయితే హాయ్ నాన్న సినిమా కథ నాగార్జున సంతోషం సినిమా కథ నుంచి తీసుకున్నారని నెట్టింట వైరల్ గా మారింది. సంతోషం సినిమాలో నాగార్జున, గ్రేసీ సింగ్ ప్రేమించుకొని.. ఇంట్లో వాళ్లను కాదని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఓ బాబును కంటారు కూడా.
గ్రేసీ సింగ్ క్యారెక్టర్ చనిపోయాక వాళ్ల ఇంటికి వెళ్తాడు నాగార్జున. అక్కడ శ్రియ నాగార్జునని ప్రేమిస్తుంది. అలా నాగార్జున బాబుకి కూడా దగ్గరయి.. చివరకు పెళ్లి చేసుకుంటారు. అయితే ఇప్పుడు నాని హాయ్ నాన్న టీజర్, సాంగ్స్ చూస్తే కూడా ఈ సంతోషం సినిమానే ప్రేక్షకులకు గుర్తుకు వస్తుంది. నాని తన కూతురుతో కలిసి ఉంటూ ఉండగా.... వీళ్ళ జీవితంలోకి మృణాల్ వస్తుంది. వీళ్లిద్దరికీ బాగా దగ్గరవుతుంది మృణాల్.

ఇక నాని మృణాల్ కు ప్రపోజ్ చేస్తాడు.. చివరికి వీళ్లు కలిపోతారు అన్నట్లు చూపించారు. అయితే శృతి హాసన్ గతంలో నాని భార్య అయి ఉండొచ్చని ఆమె చనిపోతే... మళ్లీ మృణాల్ తో నాని ప్రేమలో పడిపోతాడు అని అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయో. ఇక నాని హాయ్ నాన్న స్టోరీ సంతోషం సినిమాకు దగ్గరగా ఉందని నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తమిళ్ లో ఇటీవల వచ్చిన దాదా సినిమా సేమ్ ఇలాగే ఉంది. ఆ సినిమా కథ, హాయ్ నాన్న కథ ఒకటే అవ్వొచ్చని అంటున్నారు. ఇక ఇటీవల హాయ్ నాన్న ప్రమోషన్స్ లో మాత్రం నాని టీం... ఇది ఒరిజినల్ స్క్రిప్ట్ అని, ఎక్కడ్నుంచి కాపీకొట్టలేదని చెప్పుకువచ్చింది. మరి సినిమా రిలీజయ్యేదాకా వేచి చూడాల్సిందే. హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న థియేటర్లోకి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











