ఆ హీరోగారికి రాజమౌళి హిట్ ఇస్తే ..అంతే ఇక కోట్లే..!
దినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అలా మొదలైంది" సినిమా సూపర్ సక్సెస్ అయ్యే సరికి నానీ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న మొన్నటి దాకా ఇరవై లక్షలు ఇస్తే మహాప్రసాదంలా కళ్ళకద్దుకుని తీసుకున్న హీరో ఇప్పుడు ఒక్కసారిగా 60 లక్షలు డిమాండ్ చేసున్నాడు. అవును... అతనే నాని! ఒక్క సినిమా అతని జీవితాన్ని మార్చేసింది. ఇటీవల రిలీజ్ అయిన 'అలా..మొదలైంది' సినిమా కమర్షియల్ గా విజయాన్ని సాధించింది. దీనికి తోడు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఈగ' సినిమాలో కూడా నాని నటిస్తుండడంతో అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అంతే కాదండోయ్ తమిళంలో అంజన అనే దర్శకరాలి దర్శకత్వంలో వెప్పమ్ పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సెగ పేరుతో రిలీజ్ చెయ్యబోతున్నారు. దీంతో తన రెమ్యూనరేషన్ని అమాంతంగా పెంచి పారేశాడు. అతని రెమ్యూనరేషన్ గతంలోలా 20 లక్షలు అనుకుని వెళ్లిన వాళ్లు తను చెబుతున్న తాజా ఫిగర్ విని షాక్ అవుతున్నారు. మరో హిట్ వస్తే... ఇక కోట్లే!


Click it and Unblock the Notifications











