నాని, కృష్ణ వంశీ చిత్రం పూర్తి డిటేల్స్
నాని, కృష్ణ వంశీ చిత్రం సైలెంట్ గా మొదలై హైదరాబాద్ చుట్టు ప్రక్కల రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మళయాళి ముద్దుగుమ్మ కేధరిన్ ధెరిసా చేస్తోంది. కన్నడ లో యోగరాజ్ భట్ చిత్రాలకు కెమెరా అందించే సంతోష్ రాయ్ ఈ చిత్రం తో తెలుగుకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రానకి టైటిల్ గా పైసాలో పరమాత్మ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక కృష్ణవంశీ రీసెంట్ గా చేసిన సినిమాలేవీ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. శ్రీకాంత్ తో చేసిన మహాత్మ,గోపీచంద్ తో చేసిన మొగడు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. అయితే కృష్ణ వంశీ శిష్యురాలు నందినీరెడ్డి..నానిని ఒప్పించి ఈ చిత్రం ఓకే చేయించినట్లు సమాచారం. ఇక నాని విషయానికి వస్తే వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఈగ,గౌతమ్ మీనన్ తో చేసిన ఎటో వెళ్లి పోయింది మనస్సు చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. రెండింటిలోనూ సమంతనే హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











