twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌కు అతిథులుగా ఎన్టీఆర్, నాగార్జున.. వచ్చేది ఏ రోజంటే!

    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : NTR & Nagarjuna Are Invited For Closing Ceremony Of Show

    బిగ్‌బాస్ తెలుగు 2 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. మరికొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగియబోతున్నది. మరో ఆరుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ వారం జరిగే ఎలిమినేషన్ తర్వాత టాప్ ఐదుగురు సభ్యులు బిగ్‌బాస్ టైటిల్ కోసం పోటీ పడుతారు. అయితే ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

    ముగింపు వేడుక కోరకు

    ముగింపు వేడుక కోరకు

    ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్, గీతా మాధురి, సామ్రాట్, దీప్తి నల్లమోతు, తనీష్, రోల్‌రైడా మిగిలారు. ఈ శనివారం గానీ.. ఆదివారం గానీ ఓ సభ్యుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇక ఆపై ఆదివారం ఫైనల్ వేడుకకు ముస్తాబుతున్నది. టైటిల్ విజేత ఎవరో తేల్చడానికి రంగం సిద్దమవుతున్నది.

     నాగార్జున, ఎన్టీఆర్ అతిథులుగా

    నాగార్జున, ఎన్టీఆర్ అతిథులుగా

    నాని హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు షో జరుగుతున్నది. ఈ షోను ఆయన తనదైన స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ముగింపు వేడుకకు ఇద్దరు సినీ ప్రముఖులను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో అక్కినేని నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నట్టు సమాచారం.

     బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా ఎన్టీఆర్

    బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా ఎన్టీఆర్

    తెలుగు బిగ్‌బాస్ సీజన్ వన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహారించారు. ఈ కార్యక్రమాన్ని తన టాలెంట్, మాటల చాతుర్యంతో మరోస్థాయికి తీసుకెళ్లాడు. అలాంటి ఎన్టీఆర్‌ను ముగింపు వేడుకకు అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారట. ఈ మేరకు ఎన్టీఆర్‌తో సంప్రదించగా.. ఆయన అంగీకారం తెలిపినట్టు తెలిసింది.

    స్టార్ మాతో నాగార్జునకు

    స్టార్ మాతో నాగార్జునకు

    ఇక నాగార్జునకు స్టార్ మాతో చక్కటి అనుబంధం ఉంది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రానికి ఆయన హోస్ట్‌గా వ్యవహారించారు. అలాగే గతంలో మా టీవీకి భాగస్వామిగా కూడా ఉన్నారు. ఈ అనుబంధంతో నాగార్జునను ఆహ్వానించినట్టు తెలిసింది. నాని, నాగార్జున కలిసి దేవదాస్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Bigg Boss Telugu 2 show is coming to end. This show will be concluded in few days. In this occassion, Star MAA is planning to orgnised closing ceremony in grand fashion. So, They are in plans to invite NTR, and Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X