తిరిగి.. తిరిగి.. నాని వద్దకు.. కొత్త సినిమా అతడితోనే!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున మరో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా నాని నటించే కొత్త చిత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. విభిన్న చిత్రాలతో ఆకట్టుకునే చంద్రశేఖర్ ఏలేటి దర్శత్వంలో నటించేందుకు నాని సై అన్నట్లు తెలుస్తోంది.
మొదటగా సాయిధరమ్ తేజ్, ఆ తరువాత నితిన్ తో ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ తెరకెక్కించాలని భావించారు. ఆ హీరోలిద్దరూ సిద్ధంగా లేకపోవడంతో ఈ దర్శకుడు నానికి కథ వినిపించాడట. స్టోరీ లైన్ నచ్చడంతో నాని అంగీకరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కథ అటు ఇటు తిరిగి నాని వద్దకు చేరింది.

నాగార్జునతో నటించే మల్టీస్టారర్ చిత్రం పూర్తయ్యాక నాని జెర్సీ చిత్రంలో నటించాల్సి ఉంది. సమయంలో చంద్రశేఖర్ ఏలేటి చిత్రం కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











