V సినిమాలో నాని రోల్ లీక్: ప్రీ క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్.. సినిమా మొత్తానికే హైలైట్ ఇదేనట.!
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చినా.. అద్భుతమైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభంలోనే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేసి సక్సెస్ అయ్యాడు. ఇదే అతడిని మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలిపింది. జయాపజయాలతో సంబంధం లేకుండా సాగుతున్న అతడి కెరీర్‌ను ఈ మధ్య పలు పరాజయాలు కుదిపేశాయి. ఇలాంటి సమయంలో అతడు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే V అనే సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్‌లో నటిస్తున్నాడు. తాజాగా ఆ పాత్రకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

అందులో మెప్పించాడు.. ఇందులో నిరాశ పరిచాడు
కొద్ది రోజులుగా నాని కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. ఈ క్రమంలోనే ఆ మధ్య ‘జెర్సీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు నానికి మంచి పేరు తెచ్చింది. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో చేసిన ‘గ్యాంగ్ లీడర్' మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. రివైంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది.

సక్సెస్ కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో నాని అంత స్పీడుగా మరెవరూ సినిమాలు చేయలేరన్న టాక్ ఉంది. అందుకు అనుగుణంగానే అతడు ‘గ్యాంగ్ లీడర్' పట్టాలపై ఉన్నప్పుడే పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వాటిలో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ‘V' అనే సినిమాలో అతడు సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఇందులో నాని తనలోని మరో యాంగిల్ చూపించబోతున్నాడు.

‘V’లోనే మొత్తం ఉంది.. అందుకే ఇలా పెట్టారు
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని విలన్‌గా నటించబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా అతడు సైకో కిల్లర్‌గా కనిపించబోతున్నాడని అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే, నివేదా థామస్, అతిథి రావు హైదరీ హీరోయిన్లుగా చేస్తున్నారు.

రక్షకుడి వెంటే విలన్ కూడా వచ్చేశాడు
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సుధీర్ బాబు.. విలన్‌గా నటిస్తున్న నానికి సంబంధించిన లుక్కులను కొద్ది రోజుల క్రితం విడుదల చేసిందీ చిత్ర యూనిట్. ఈ రెండింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నాని లుక్ చూసిన వారంతా అతడు కచ్చితంగా ఈ సినిమాలో విలనే అని డిసైడ్ అయిపోయారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Vలో నాని రోల్ లీక్: ప్రీ క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాలో నాని నెగెటివ్ రోల్ చేస్తున్న మాట వాస్తవమేనట. అయితే, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో అసలు విలన్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే ఈ ట్విస్ట్ సినిమాకే హైలైట్ అని తెలిసింది.
Recommended Video

నాని విలన్ అవడానికి ఆమె కారణం
V మూవీలో నాని విలన్‌గా మారడానికి నివేదా థామస్ కారణం అని కూడా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో నాని ప్రేమించే అమ్మాయిగా నివేదా కనిపిస్తుందట. మెయిన్ విలన్ గ్యాంగ్ ఓ కారణంతో ఆమెను చంపేస్తారని సమాచారం. తన ప్రేయసిని చంపిన వారిపై పగ తీర్చుకునేందుకే నాని విలన్‌గా మారుతాడనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











