హిట్టు సినిమాకు సీక్వెల్.. నాని మళ్ళీ అదే దర్శకుడితో ప్లాన్ చేస్తున్నాడా?
న్యాచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద హిట్టు చూసి చాలా కాలమవుతోంది. 2017లో నిన్ను కోరి సినిమా తరువాత పెట్టిన పెట్టుబడికి అత్యదిక లాభాలని అందించిన సినిమాలు రాలేదు. జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు పరవాలేదు అనిపించినప్పటికి కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేకపోయాయి. దీంతో నాని కొంత స్టైల్ ని మార్చాడు. V సినిమాతో కమర్షియల్ గా హిట్టు కొట్టాలని అనుకున్నాడు.
కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఇక నెక్స్ట్ నాని టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాల తరువాత నాని తన కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన మారుతితో మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వీరి కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ సినిమాలో ఒకటిగా నిలిచింది.

అయితే అదే కథకు మారుతి సీక్వెల్ రెడీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నాని కూడా మారుతితో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇక BBM సినిమాకు సీక్వెల్ అంటే ఏ మాత్రం నో చెప్పడని చెప్పవచ్చు. ఇక మరోవైపు మారుతి నెక్స్ట్ సినిమాపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. యూవీ క్రియేషన్స్ లోనే గోపిచంద్ తో ఒక సినిమా అనుకున్నట్లు కొన్ని రోజుకు క్రితం ఒక టాక్ అయితే వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











