పెద్ద ప్లానే వేసిన నాని… అక్క సినిమాని అలా కానిచ్చేస్తాడట!

నేచురల్ స్టార్ నాని ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క సినిమాలు నిర్మిస్తూ రెండు చేతులా సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇప్పటికే ఆయన వాల్ పోస్టర్ సినిమా అనే ఒక బ్యానర్ స్థాపించి దాని ద్వారా రెండు సినిమాలు నిర్మించారు. మూడో సినిమా నిర్మాణంలో ఉండగా ఇప్పుడు నాలుగో సినిమా కూడా ఈ మధ్యనే లాంచ్ అయింది.. ఇప్పటికే ఒక షార్ట్ ఫిలిం చేసిన అనుభవం ఉన్న మాని సోదరి దీప్తి గంటా డైరెక్షన్ లో మీటింగ్ క్యూట్ అనే సినిమా ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా గురించి కొద్ది రోజుల నుంచి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అదేమిటంటే ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ వార్త నిజమేనని అంటున్నాయి. అంతేకాక హీరోయిన్స్ విషయంలో నాని ప్లానింగ్ కూడా మామూలుగా లేదని అంటున్నారు. నిజానికి ఐదుగురు హీరోయిన్స్ చేత నటింపజేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ నాని చేస్తున్న ప్లానింగ్ మాత్రం ఐదుగురు హీరోయిన్స్ కాదు మరో ఇద్దరు ముగ్గురు కూడా హీరోయిన్స్ చేత కూడా నటింపజేసేలా ఉందని అంటున్నారు.

nani planning for meet cute movie is marvellous

ఎందుకంటే ఆ పాత్ర‌ల్లో పేరున్న క‌థానాయిక‌ల‌నే తీసుకోవాల‌న్న‌ది నాని ఆలోచ‌న‌. అన్నీ ఒక‌ట్రెండు రోజుల పాత్ర‌లే కావడంతో అందరు హీరోయిన్ల‌ను అతిథి పాత్ర‌లని నాని ఒప్పించడాని అంటున్నారు. పారితోషికాలు ఇచ్చినా అవి చాలా తక్కువలో అవగొడుతున్నాడట. నానికి ఉన్న క్రెడిబిలిటీ కారణంగా హీరోయిన్స్ కూడా సినిమాలు చేయడానికి ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది. మరి చూడాలి నాని ప్లానింగ్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది అనేది. ఇక మరో పక్క నాని హీరోగా చేసిన టక్ జగదీశ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Read more about: nani నాని
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X