అంతా ఫిక్స్ అయ్యాక ఆ సినిమాని హోల్డ్ లో పెట్టిన నాని.. అసలేమైంది ?
గత ఏడాది వీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ సినిమా ఆశించినంత మేర అంచనాలను అందుకో పోవడంతో ఆయన ఇప్పుడు తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఆయన హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆ సినిమా వాయిదా వేశారు. ఆ సినిమా సంగతి పక్కన పెడితే నాని మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ కాగా మరో సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ.
ఈ సినిమాలు కాకుండా నాని ఒక కొత్త దర్శకుడు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గతంలో ప్రచారం జరిగింది. శ్రీకాంత్ అనే ఒక కొత్త దర్శకుడి చెప్పిన కధకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారు. ఇప్పుడు ఆ సినిమా విషయంలోనే నాని వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఏమైందో ఏమిటో తెలియదు కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ సినిమాని ప్రస్తుతానికి నాని హోల్డ్ లో పెట్టినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పూర్తి తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథను నాని చాలా ఇష్టపడని గతంలో ప్రచారం జరిగింది. ఇంకా సినిమా ప్రకటించడమే ఆలస్యం అని అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారనే వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాను ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాని నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మించాలని అనుకుంది. నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











