రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' లో ఆ యంగ్ హీరోనే...
రాజమౌళి త్వరలో ప్రారంభించనున్న ఈగ చిత్రంలో హీరోగా నానిని ఎంపిక చేయనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే మరీ పెద్ద కానీ, చిన్న కానీ హీరోయిన్ ని అతని సరసన చేయటానికి పరిశీలిస్తున్నారని వినపడుతోంది. ఆ రేసులో సలోని, బిందుమాధవి కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం లో బడ్జెట్ లో నిర్మించనున్నారని సురేష్ ప్రొడక్షన్స్ వారు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని వార్త. ఇక అష్టా చెమ్మ చూసిన రాజమౌళి...నానిని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజమౌళి అడగటంతో కథ,రెమ్యునేషన్ వంటి పదాలేమీ లేకుండా నాని ఎగ్రీ అయ్యాడని అంటున్నారు.అయితే రాజమౌళి కుమారుడు కార్తీక్ కూడా మరో ఆప్షన్ గా పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న విషయం. కార్తిక్ ఇప్పటికే మర్యాదరామన్న చిత్రంలో ఓ చిన్న రోల్ లో కనిపించాడు. సునీల్ ఊళ్లోకి రాగానే అతనికి ఒక పిల్లాడు దారి చూపెడుతాడు అతనే రాజమౌళి కుమారుడు.ఇక ఈ ఈగ చిత్రం ఈ నెలాఖురలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











